Monday, December 23, 2024

మొదటి బహుమతిని దక్కించుకున్న అటవీశాఖ

- Advertisement -
- Advertisement -

Telangana forest department won the first prize

అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలోని స్టాల్‌కు గుర్తింపు
హోంమంత్రి చేతుల మీదుగా బహుమతిని అందుకున్న అటవీశాఖ అధికారులు

హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్)లో తెలంగాణ అటవీ శాఖ తరపున ఏర్పాటు చేసిన స్టాల్‌కు ప్రథమ బహుమతి దక్కింది. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అటవీ శాఖకు తొలి బహుమతి వరించడంపై ఆశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణకు హరితహారం ద్వారా అటవీ శాఖ ఏడేళ్లుగా అమలు చేస్తున్న పర్యావరణ హిత కార్యక్రమాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రదర్శనలో ఉంచింది. పచ్చదనం పెంపు, జంతు సంరక్షణ చర్యల నమూనాలను ఈ ప్రదర్శనలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. అడవి థీమ్‌తో ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారంతో పాటు, పిల్లల కోసం ఏర్పాటు చేసిన మినీ జూ కూడా సందర్శకులను పెద్ద సంఖ్యలో ఆకట్టుకుంది. ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన ముగింపు కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధుల చేతులు మీదుగా అటవీ శాఖ అధికా రులు ఈ బహుమతిని అందుకున్నారు. మొదటి బహుమతి గెల్చుకున్నందుకు అధికారులు, సిబ్బందిని పిసిసిఎఫ్ అండ్ హెచ్‌ఓఎఫ్‌ఎఫ్ ఆర్‌ఎం డోబ్రియల్ అభినందించారు.

Telangana forest department won the first prize

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News