Thursday, January 23, 2025

తెలంగాణ ఆచరణ.. దేశం అనుసరణ

- Advertisement -
- Advertisement -

మెదక్ : జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మనకు స్వాతంత్రం దినోత్సవం వంటిదని, తెలంగాణ సా ధించుకుని 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని దశాబ్దికి చేరుకున్నందున రాష్ట్ర ప్రజలందరూ కూడా 21 రోజులపాటు పండగ వాతవరణంలో ఈ దశా బ్ది ఉత్సవాలు నిర్వహించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో మెదక్ కలెక్టరేట్‌లోని సమీక్ష సమావేశం నిర్వహించి దశాబ్ది ఉత్సవాల ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఏర్పడింది కాబట్టే తెలంగాణ అద్భుతంగా ప్రగతి పథంలో దూసుకుపోతుందని అన్నా రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కలిసి ఉన్ననాడు తెలంగాణలో ఉన్న పది జిల్లాల్లో తొమ్మిది జిల్లాలను వెనుకబడ్డ ప్రాంతంగా ఆనాటి ప్లానింగ్ కమిషన్ గుర్తించిందన్నారు.

కానీ నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. నేడు దేశానికే తెలంగాణ మోడల్‌గా నిలిచిందని తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరిస్తుందని నానుడి దే శంలో నెలకొందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకపోతే నేటికి తెలంగాణ ఇంకా వెనుకబడిన ప్రాంతంగానే ఉండేదని, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంత ప్రజలు అద్బుతమైన స్వేచ్ఛ వాయువులను పీలుస్తూ 95శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించుకుంటూ రాష్ట్రంలోని 33 జిల్లాలను ప్రగతి ప్రస్థానంలోకి తీసుకెళ్లిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయిస్తే కాంగ్రెస్, బిజెపిలకు మింగుడు పడడం లేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు తెలంగాణ ఉత్సవాలను జరపబోమని అనడం తెలంగాణ అమరుల త్యాగాలను కించపరిచినట్లేనని అన్నారు.

కాంగ్రెసోల్లు ఆరోజు ఉద్యమంలో లేరు, ఈ రోజు సంబరాలు కూడా జరుపమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ నాడు ఉద్యమంలో కలిసి రాలేదు…నేడు అభివృద్ధిలో కూడా కలసిరాలేకపోతున్నారని అన్నారు. ఇక బిజెపి వాళ్లు ప్రత్యేక ఉత్సవాలు జరుపుతామని కిషన్‌రెడ్డి అంటున్నారు కానీ ఆరోజు ఉద్యమ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు రాజీనామా చేయాలంటే ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలలో ఒకరు రాజీనామా చేయగా కిషన్‌రెడ్డి మొహం చాటేశారని ఇప్పుడు ఎలా ప్రత్యేక ఉత్సవాలు చేస్తావో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడ్డక ఏడు మండలాలను ఆంధ్రకు అప్పజెప్పడంతోపాటు క్రిష్ణ బోర్డులో మన నీటి వాటా ఎంతో ఇప్పటికి తెల్చని మీరు ఏవిధంగా ప్రత్యేక సంబరాలు జరుపుతారని అన్నారు. అంతేకాకుండా పార్లమెంట్‌లో చేసిన చట్టాన్ని తుంగలో తొక్కి నిధులు, నియమాకాలను రప్పించకుండా సంబరాలు ఏ మొహం పెట్టుకుని చెస్తారని బిజెపి వారిని ప్రశ్నించారు.

9 సంవత్సరాల నుంచి సిఎం ప్రధానమంత్రిని కలిసి క్రిష్ణ వాటా గురించి పలుమార్లు వెళ్లి కలిసిన సమస్య పరిష్కరించలేని మీరు ప్రత్యేక సంబరాలు జరపడానికి అర్హులు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాష్ట్ర అవతరణను ఎవరు వ్యతిరేకించిన ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరన్నారు. ఎందుకంటే రాష్ట్రం వచ్చిందిగానుకనే నేడు 24 గంటల విద్యుత్, రైతులకు రైతు బీమా, రైతుబంధు, పింఛన్లతోపాటు అన్ని సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయని అన్నారు. వలసలు వాపసు వచ్చి ప్రజలందరు కూడా ఆనందంగా ఉన్నారని అన్నారు. ఇలాంటి ఘనత సాదించుకున్నందుకు ప్రజలందరు సంతోషంగా దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్నారని ఎవరైనా అడ్డుపడితే రాష్ట్ర ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరన్నారు. ఈ ఉత్సవాలకు ప్రజలనుంచి అద్భుతమైన స్పందన ఉందని ప్రజలే కేంద్రంగా, ప్రజలే వేదికగా ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.

కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకపోగా వారికి సలాం కొట్టే వారికే ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తుందన్నారు. సిఎం కెసిఆర్ నీతి అయోగ్‌కు హాజరుకాలేదని బిజెపి మాట్లాడటం హాస్యస్పదమని అసలు నీతి అయోగ్‌కు కనీస విలువ ఉందా అని ప్రశ్నించారు. అదే నీతి అయోగ్ తెలంగాణలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు 24వేల కోట్ల రూపాయలు ఇవ్వమని చెబితే ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేరని ప్రశ్నించారు. ఎవరు అడ్డువచ్చిన తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారి అభివృద్ధిలో నంబర్‌వన్ స్థానంలో ఉందన్నారు. పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టమంటే కేంద్రం నోరు మెదపలేదు. తెలంగాణలో 175 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి రాజ్యాంగ నిర్మాతకు అరుదైన గౌరవం మేము కల్పించామన్నారు. పార్లమెంట్‌కు ఖచ్చితంగా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

నేటి రోజున జిల్లాలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై మూడు జిల్లాలైన మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట అధికారులతో మొట్టమొదటిసారి సమీక్ష నిర్వహించామని అందులో భాగంగా అన్ని అభివృద్ధి అంశాలపై చర్చించామన్నారు. ముఖ్యంగా మూడు జిల్లాలలో ఒక్క ఏఎన్‌ఎం సెంటర్ భవనం లేకుండా ఉండద్దని వందశాతం ఏఎన్‌ఎం సబ్‌సెంటర్లకు వైద్యశాఖ నివేదికలు పంపాలని రాబోయే మూడు నెలల్లో వందశాతం సబ్‌సెంటర్లను నిర్వహించాలని డిఎంఅండ్‌హెచ్‌ఓ, కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మూడు జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, ప్రశాంత్ జీవన్ పాటిల్, సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత, సంగారెడ్డి ఎస్పి రమణకుమార్, మెదక్ డిఎస్పీ సైదులు, మెదక్, సిద్దిపేట జడ్పీ చైర్‌పర్సన్‌లు హేమలతశేఖర్‌గౌడ్,

రోజా శర్మ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునతారెడ్డి, పార్లమెంట్ సభ్యులు బిబిపాటిల్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, యాదవరెడ్డి, శాసనసభ్యులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మాణిక్యరావు, క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, సతీష్, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డిలతోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News