Wednesday, January 22, 2025

దశాబ్ది తెలంగాణ సంబురాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని జూన్ 2న దశాబ్దిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవం సంబురాలు 21 రోజుల పాటు రోజుకు ఒక ప్రత్యేకతతో కార్యక్రమాలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు రూ.105 కోట్లు కేటాయించి ఆ ఉత్సవ వేడుకలలో అందరిని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయం ఉట్టి పడేలా సంబురాలు ఘనంగా నిర్వహించాలని ప్రణాళిక తయారు చేసింది. ఆనాడు తెలంగాణ ప్రాంతం ఆంధ్ర పాలనలో రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వెనుకబడింది, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి ప్రత్యేక రాష్ట్రం ద్వారానే సాధ్యం అవుతుందని భావించి తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ముందుకు వెళ్లి, పోరాట అమరుల త్యాగ ఫలితంగా రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆశయాలను అమలుచేస్తూ వ్యవసాయానికి సాగు నీరు అందించాలనే లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథ కం, అతితక్కువ కాలంలో నిర్మించిన భారీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తున్న ఘనత కెసిఆర్ ది. మిషన్ కాకతీయతో ప్రతి చెరువు, కుంట పునర్ నిర్మాణం చేసి నిండు జలకళల కనబడు తూ ఒక్కప్పుడు నెర్రలు వారినా భూమిని నేడు కృష్ణా, గోదావరి జలాలతో తడుపుతున్నారు.

రైతులు ఏడాదికి రెండు పంటలు పండిస్తూ రాజులా జీవిస్తున్నారు. రైతులకు ఉచిత 24 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం, రైతు పండించిన పంట కు గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుం ది. రైతులకు ఉచిత ఎరువులు, వ్యవసాయ సామాగ్రిలకు రాయితీలు కల్పిస్తుంది. రైతులు పండించిన పంట దాచుకోవడానికి గోదాంలు, గిడ్డంగులు, రైతులు సమావేశాలు నిర్వహించుకోవాడానికి రైతు వేదికలు ఏర్పాటు చేసింది. రైతు బంధు, రైతు బీమాతో రైతుకు అండగా నిలబడుతుంది తెలంగాణ సర్కారు.
రైతును రాజు చేయాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడాలేని విధం గా రైతు క్షేమం గురించి ఆలోచిస్తూ రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. గత పాలనలో రైతుల ఆత్మహత్యలు ఎటూ చూసిన పరెలు వాళిన నేలతో ఎడారిలా కనబడేది అప్పటి గొర్ల కాపరులు మేపు కోసం పక్క రాష్ట్రాలకు తీసుకు వెళ్లిన చరిత్ర ఉంది అటువంటి పరిస్థితుల నుండి తెలంగాణ సరిహద్దు ప్రాంతలాలో ఇతర రాష్ట్రాల కూలీలు తెలంగాణకు ఉపాధికై వలస వస్తున్నారు. ఒక్కప్పటి కరవు జిల్లా పాలమూరు నేడు పచ్చని మాగనితో కళ కళలాడుతున్నాయి.

మన పరిపాలన మనకే అని మన ప్రాంత నిధులు, సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఒక్కరికీ చేరాలని భావించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నేడు అన్ని కులాల వారికి చేయూత అందిస్తూ కుల వృతులను ప్రోత్సహిస్తూ చైర్మెన్‌లను నియమించి, వివిధ కులాల వారికి కార్పోరేషన్, పెడరేషన్‌ల ద్వారా రుణాలు మంజూరు చేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారు కెసిఆర్. వివిధ మతాల వారిని ఆదరిస్తూ క్రిస్మస్, రంజాన్, బతుకమ్మలకు దుస్తుల పంపిణీ చేస్తూ బోనాలు నిధులు మంజురూ చేస్తూ అన్ని మతాలను భిన్నత్వంలో – ఏకత్వంగా సర్వమతాలను సమానంగా పరిపాలిస్తున్నారు. అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి సోదరభావంతో తెలంగాణలో జీవిస్తున్నా రు. కంపెనీ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి అనుమతులను నిర్ణీత సమయంలో ఇస్తుం ది తెలంగాణ ప్రభుత్వం. నియామకాల విషయంలో ప్రభుత్వం యువత ఆదర్శం గా జీవించాలంటే చిన్ననాటి నుండే విద్యా బుద్ధులు తప్పనిసరి అని భావించి గురుకులాలు, మండల్ పాఠశాలలు, ప్రభుత్వ బడులలో సకల వసతులు కల్పించి వారికి కార్పొరేట్ బడులకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తుంది సర్కార్. శిథిల వ్యవస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజిలు, డిగ్రీలను పునర్నిర్మాణంచేసింది.

ప్రభుత్వ మెడికల్ కాలేజిలను ఏర్పాటు చేసి పేద విద్యార్థుల ఉన్నత చదువును అందిస్తుంది. చదువుల కోసం బయటి దేశాలకు వెళ్లే వారికి ఒవర్ సీస్ స్కాలర్ షిప్‌ల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. తెలంగాణ ప్రాంత ఇంజినీరింగ్ విద్యార్థులకు టి హబ్ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా యువత ఆర్థికంగా ఎదిగినప్పుడే వారి కుటుంబాలు బాగుంటాయని భావిం చి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. నేడు గ్రామాలన్నీ సర్వసుందరంగా తీర్చి దిద్దీ తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సిఎంది. మహిళలు రాజకీయ, ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందాలని వారికి అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తుంది, స్థానిక సంస్థ ల ఎన్నికలలో 50% రిజర్వేషన్ అమలు చేస్తుంది. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. బిఆర్‌ఎస్ సంక్షేమం అందని ఇల్లు లేదు అభివృద్ధి ఫలాలు పొందని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ అమరుల ఆశయాలకై కెసిఆర్ ముందుకు అడుగులు వేస్తున్నారు.

మిద్దె సురేష్, 9701209355

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News