Monday, December 23, 2024

పదేళ్లలో నూరేళ్ల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట ప్రతినిధి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవతరించిన పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధిని సాధించుకున్నామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆవతరణ దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర అభివృద్ధి సందేశాన్ని ఇచ్చారు. కేసీఆర్ సీఎం కావడంతోనే తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకపోయి యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సిఎం కెసిఆర్ పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు ఆనతీ కాలంలోనే పూర్తయిందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి కావడంతోనే గోదావరి జలాలు పంట పోలాలకు అందడంతో ఎటు చూసినా పచ్చదనమే కనబడుతుందన్నారు.

సగం భారత్ దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. సిద్దిపేట ప్రజల దశాబ్ధాల కల అయిన జిల్లా ను ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఎంతో పాలన అందుతుందన్నారు. ఆనాటి పాలకులు దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతో పంట పెట్టుబడి సాయం, రైతు బీమా లాంటి సౌకర్యాలను కల్పించి పండించిన పంటలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. మండు టెండ ల్లో సైతం మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. పంటలు పండించడమే కాకుండా ఆ పంట దిగుబడులను విక్రయించడానికి మార్కెట్ వ్యవస్ధను పటిష్టంగా తీర్చిదిద్దామన్నారు.

ఈ ఉత్సవాలలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాదాకృష్ణశర్మ, ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ శ్వేత, అదనపు కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సెన్, ప్రజాప్రతినిధులు, నాయకులు కడవేర్గు మంజుల రాజనర్సు, మారెడ్డిరవీందర్‌రెడ్డి, పాల సాయిరాం, మచ్చ విజిత వేణుగోపాల్‌రెడ్డి, నాగరాజు రెడ్డి, మల్లికార్జున్, బుచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News