Monday, December 23, 2024

ఎందరో వీరుల పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం: కలెక్టర్

- Advertisement -
- Advertisement -

Telangana formation day celebration 2022

హైదరాబాద్: ఎందరో వీరుల పోరాటం, ప్రాణత్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ రాష్ట్ర అభివృద్ది పునరంకితులై అన్ని రంగాల్లో జిల్లాను ముందుకు నడపించేందుకు తమవంతు సహాకారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సూర్యలత, ఎస్‌డిసిల్యాండ్ ఎక్విజిషన్ జనరల్ శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ సంతోషిణి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది. జిల్లా గజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మన్నెబోయిన కృష్ణాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News