Saturday, January 11, 2025

శాసనసభలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అసెంబ్లీ ఆవరణలో ఘనంగా జరిగాయి. శాసన మండలి ప్రాంగణంలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శేరి శుభాష్ రెడ్డి, రఘోత్తమ రెడ్డి, వి.గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్, ఎల్. రమణ, దండే విఠల్,  అసెంబ్లీ కార్యదర్శి చార్యులు, టిఆర్‌ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News