Friday, January 10, 2025

దేశంలో బిజెపి పతనం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బహ్రెయిన్‌లో ఎన్నారై బిఆర్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బిఆర్‌ఎస్ సెల్ ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముందుగా అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. దేశంలో బిజెపి పతనం ప్రారంభమైందని వారు స్పష్టం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయమే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో దేశ ప్రజలు బిజెపికి గుణపాఠం చెప్పేందుకు యావత్ భారతావని సన్నద్ధం అవుతుందన్నారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ అందిస్తున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధిని దేశ ప్రజలు గమనిస్తున్నారని, వారు కూడా కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.

తెలంగాణలో బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, మూడోసారి కూడా కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని వారు స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని ప్రధాన కార్యదర్శి పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్‌లు పేర్కొన్నారు. కెసిఆర్ పాలన, పార్టీ విధానాలకు ఆకర్షితులై బిఆర్‌ఎస్‌లో పని చేయడానికి దేశ ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు సంగేపోలు దేవన్న, ఉత్కం కిరణ్ గౌడ్, కొత్తూరు సాయన్న, బొలిశెట్టి ప్రమోద్, చంద్రశేఖర్, కాశీమ్, రవి కుమార్, అన్నారం శ్రీ కుమార్‌లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News