Sunday, December 22, 2024

జలమండలిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

Telangana Formation Day celebrations in Jalamandali

హైదరాబాద్: జలమండలిలో తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. గురువారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయలో జరిగిన ఈవేడుకలకు ఎండీ దానకిషోర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జలమండలి అధికారులు, ఉద్యోగులు, వినియోగదారులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వప్నమైన బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగమవుతూ జలమండలి సేవలను మరింత మెరుగపరిచేందుకు పునరంకితం కావాలని ఆయన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జలమండలి ఈడీ డా. సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, పర్సనల్ డైరెక్టర్ శ్రీధర్‌బాబు, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్లు ఆజ్మీరా కృష్ణ, స్వామి, సీజీఎంలు, జీఎంలు తదితరులు పాల్గొన్నారు. నగరంలో జలమండలి డివిజన్ సెక్షన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అదికారులు, ఉద్యోగులు వేడుకల్లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News