Friday, January 24, 2025

ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

Telangana formation day celebrations in Pragati bhavan

హైదరాబాద్: ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ అదే స్ఫూర్తితో నిర్మించుకున్నామన్నారు. ఇవాళ దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉందని, ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణలో కొనసాగుతోందన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీలు సంతోష్‌ కుమార్‌, దీవకొండ దామోదర్‌ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, వివేకానంద, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ప్రగతి భవన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News