Wednesday, January 22, 2025

సూర్యాపేటలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించి మంత్రి జగదీష్ రెడ్డి వేడుకలు ప్రారంభించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  పరేడ్ గ్రౌండ్ లో మంత్రి జగదీష్ రెడ్డి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మంత్రి జగదీష్ రెడ్డి శాంతి కపోతాలను ఎగుర వేశారు.  సూర్యాపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన త్రివర్ణ బెలూన్ లను గాలిలోకి మంత్రి వదిలారు.

Also Read: గర్వించండి..పండుగ చేయండి

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జడ్ పి చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ వెంకట్రావు, ఎస్ పి రాజేంద్రప్రసాద్, ఆడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News