- Advertisement -
తెలంగాణ అవతరణ వేడుకలకు ఈసి అనుమతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజున గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద సిఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో రాష్ట్రావతరణ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. అంతేకాక ఆమె ఏర్పాట్లపై సమీక్షించారు.
- Advertisement -