Thursday, December 26, 2024

ఘనంగా తెలంగాణ మంచినీళ్ల పండుగ

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ రూరల్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలలో భాగంగా ఆదివారం మంచినీటి పండుగను మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో తాగునీటి ట్యాంకులను శుభ్రపరిచి తెలంగాణ రాకముందు 2014 నుంచి 2023 వరకు తాగునీటి సమస్యపై ప్రస్తుతం మిషన్ భగీరథ అధికారులు గ్రామాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతున్న తీరును గ్రామస్తులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి గ్రామాలలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుల వద్ద మామిడి, కొబ్బరి తోరణాలు అలంకరించి, రంగురంగుల ముగ్గులు వేశారు. అనంతరం గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపిటిసిలు, మిషన్ భగీరథ అధికారులు, వార్డు సభ్యులు, పంచాయతి కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామాల పురవీధుల గుండా మంచినీళ్ల పండుగ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మిషన్ భగీరథ అధికారులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపిటిసిలు, పంచాయతి కార్యదర్శులు, గ్రామ పంచాయతి సిబ్బంది, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News