హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి తెలిపారు. శాసన సభలో జీవన్ రెడ్డి మాట్లాడారు. మహాత్మా గాంధీ మాటలను ఆచరణలో పెట్టిన సిఎం కెసిఆర్‌ను తెలంగాణ గాంధీ అంటున్నారని పొగిడారు. దేశంలోనే సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సిఎం కెసిఆర్ నిలిచారన్నారు. మన సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని, అమ్మ ఒడి వాహనం లాంటి సౌకర్యంలో ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఎంఎల్‌ఎలు, మంత్రుల పిల్లలకు ఉపయోగించే ఖరీదైన వస్తువులు కెసిఆర్ కిట్‌లో ఇస్తున్నామని తెలియజేశారు. 1100లకు పైగా గురుకులాల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, అన్ని ప్రభుత్వ స్కూళ్లలో సన్న బియ్యంతో అన్నం పెడుతున్నామని, ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష 25 వేలు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని జీవన్ రెడ్డి ప్రశంసించారు. పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి రూ.20 లక్షలు ఇస్తున్నామని, తెలంగాణలో రెండు లక్షలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ కింద రూ. లక్ష 116 ఇస్తున్నామన్నారు.
కెసిఆర్… తెలంగాణ గాంధీ: జీవన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -