Wednesday, January 22, 2025

రాష్ట్ర జిడిపి వృద్ధి దేశంలోనే నంబర్ వన్

- Advertisement -
- Advertisement -

Telangana GDP growth is number one in the country

వేల్పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు, జనరంజక పాలన వలన నేడు తెలంగాణ పల్లెలు ఆర్థికంగా పరిపుష్టంగా మారాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ రాష్ట్ర జీడీపీ దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిందన్నారు.రాష్ట్ర తలసరి ఆదాయం 2014 లో 5లక్షల కోట్లు ఉంటే నేడు 11 లక్షల కోట్ల వృద్ధికి చేరుకుందని చెప్పారు.రాష్ట్ర తలసరి ఆదాయం 130శాతం పెరిగిందన్నారు. రాష్ట్ర పౌరుని వ్యక్తిగత తలసరి ఆదాయం 2014 లో 1లక్ష 28వేలు ఉంటే నేడు 2లక్షల 78వేలకు పెరిగిందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో,దూర దృష్టితో గ్రామాల్లో అన్ని కుల వృత్తులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం, రైతులకు పెట్టబడి సాయం,24 గంటల ఉచిత కరెంట్,సకాలంలో ఎరువులు, సాగునీరు ఇవ్వడం వల్ల తెలంగాణ పల్లెలు ఆర్థికంగా బలంగా ఎదిగాయని అన్నారు.

బాల్కొండ నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.నియోజకవర్గంలోని గ్రామాల్లో అంతర్గత సి.సి రోడ్ల కోసం ఈ పదిహేను రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 23 కోట్ల 5 లక్షలు మంజూరు చేసిందని చెప్పారు.కొత్తగా ఏర్పడిన18 గ్రామ పంచాయితీలకు 3కోట్ల60 లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. అందులో మండలాల వారిగా బాల్కొండ కు 2.65 కోట్లు,ముప్కాల్ 1.55కోట్లు,మెండోరా 1.80కోట్లు, వేల్పూర్ 6.10కోట్లు,భీంగల్ మండలం(మున్సిపాలిటీ మినహాయించి) 2.85కోట్లు, కమ్మర్పల్లి 3.65 కోట్లు,మోర్తాడ్ 1.95 కోట్లు,ఏర్గట్ల 1.45 కోట్లు, మానాల గ్రామంతో పాటు కొత్త 8 గ్రామ పంచాయితీలకు 1.05 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి వెల్లడించారు. ఆయా మండలాల స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. అంతేకాకుండా మొన్న మూడు రోజుల పర్యటనలో నియోజకవర్గంలో బి.టి రోడ్లు, ఇరిగేషన్ పనులు, కొత్త బ్రిడ్జిలు(మోతె, వేల్పూర్, పడిగల్, వెల్కటూర్) నిర్మాణం ఇతర అభివృద్ధి పనుల కోసం 100 కోట్ల వ్యయంతో పనులు మొదలు పెట్టుకున్నామని తెలిపారు.

బాల్కొండ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇట్లా గ్రామాల లోపల, బయట అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. కళ్ల ముందు అభివృద్ధి కన్పిస్తున్న బీజేపీ నాయకులు విమర్శలు చేయడం సరైంది కాదన్నారు.అభివృద్ధి లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే చెప్తున్న ఇక్కడి నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ కు ముందు కేసీఆర్ వచ్చిన తర్వాత అభివృద్ధి ఎట్లుందో ప్రజలు,రైతులు ఆలోచన చేయాలని మంత్రి కోరారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కు బాల్కొండ నియోజకవర్గ ప్రజల తరుపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News