మన వాణిని బలంగా వినిపించండి
తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించండి
చెరిసగం వాటా కోసం ఇప్పటికే ప్రతిపాదన పంపించాం
27 నాటి బోర్డు సమావేశంలో అది అజెండాలో ఉంది
సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలి
రాష్ట్ర హక్కుపై వాదనలు వినిపించాలి : ప్రగతిభవన్‌లో సమీక్షలో అధికారులకు
సిఎం కెసిఆర్ ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీజలాల్లో తెలంగాణ రాష్ట్రానికి సమాన నీటివాటా రాబట్టాలని అందుకోసం బోర్డు సమావేశంలో బలమైన వాణి వినిపించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు ప్రగతి భవన్‌లో సిఎం, మంత్రులు ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో సమీక్షా స మావేశం నిర్వహించారు. ఈ నెల 27 న కృష్ణానది యాజమాన్యబోర్డు సమావేశం జరగనున్నందున ఈ సమావేశం లో రాష్ట్రం తరపునుంచి చర్చించాల్సిన అంశాలను సిఎం సమీక్షించారు. బో ర్డు సమావేశంలో అజెండాలో చేర్చిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అజెండా అంశాలతోపాటే రాష్ట్రం తరపున ప్రస్తావించాల్సిన,లేవనెత్తాల్సిన అంశాలను అధికారులతో చర్చించారు.
ఈ ఏడాది కృష్ణానదీజలా ల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చెరి సగం వాటాగా నీటిని వినియోగించుకునేలా ఇప్పటికే తెలంగాణ ప్రభు త్వం బోర్డుకు ప్రతిపాదన చేసింది. ఈ అంశాన్ని కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డు కూడా 27న జరిగే సమావేశంలో అజెండాగా చేర్చింది. తెలంగాణ రా ష్ట్రం పక్షాన చర్చించాల్సిన మరికొన్ని అంశాలపై కూడా సిఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. నదీజలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఇంతకాలం జరిగిన అన్యాయాన్ని సమావేశంలో బలంగా వినిపించాలని సూచించారు. సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. దశాబ్దాలుగా రా్రష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించాలన్నారు. న్యాయమైన, చట్టపరమైన అంశాల ఆధారంగా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటానీటికోసం వాదనలు వినిపించాలని స్పష్టం చేశారు. కృష్ణాజలాల్లో ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల మధ్య 70,30 నిష్పత్తిలో నీటి పంపిణీ సహా ఇతర అంశాలపై ఎపి ప్రభుత్వం బోర్డుకు రాసిన లేఖ కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. వాస్తవాలన్నీ బోర్డుముందు ఉంచాలని సిఎం కెసిఆర్ అధికారులకు సూచించారు.
త్వరలో మల్లన్నసాగర్ ప్రారంభోత్సవం
త్వరలో తేదీ ఖరారు చేసి, మల్లన్న సాగర్ ను ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశంలో సిద్దిపేట జిల్లా, రాష్ట్రస్థాయి ఇరిగేషన్ అధికారులు, కలెక్టర్ పాల్గొన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల అంశంపై సమాచారాన్ని సిఎం అడిగి తెలుసుకున్నారు. ముంపుగ్రామాల ఖాళీ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుందని కలెక్టర్ తెలిపారు.
నీటివాటాలే కీలకం!
కృష్ణానదీజలాల పంపిణీకి సంబంధించి ఏర్పడిన జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ అప్పటి ఉమ్మడి ఆంధప్రదేశ్‌రాష్ట్రానికి 811టిఎంసిల నీటిని కేటాయించింది. అయితే 2014లో జరిగిన రాష్ట్ర పునర్ విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది కృష్ణానది జలాలల్లో తెలంగాణ , ఎపి ప్రభుత్వాలు కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశంలో ఆ ఏడాదికి సంబంధించి తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం మేరకు కృష్ణానదిలోని లభ్యత నీటిలో ఎపి 64శాతం, తెలంగాణ 36శాతం నీటి వాటాలను వినియోగించుకునేలా సర్దుబాటు చేసుకున్నాయి. ఎపి ప్రభుత్వం ఇదే అదనుగా తీసుకుని గత ఆరేళ్లుగా ఆదే నిష్పత్తిలో నీటి వాటాను వినియోగించుకుంటూ వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జనాభా పెరగటం, ప్రత్యేకించి తాగునీటి అవసరాలు పెరిగిపోతుడటం, దాంతోపాటుగా సాగు నీటి అవసరాలు కూడ పెరుగుతూ వస్తున్నాయి. నీళ్లు, నిధులు,నియామకాల ప్రాతిపాదికన ఉద్యమాల ద్వారా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ప్రభుత్వం న్యాయంగా దక్కాల్సిన నీటివాటాలకోసం ఇప్పటికే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో తెలంగాణ రాష్ట్ర వాదనలు వినిపిస్తూ వస్తోంది. ఉమ్మడి ఎపిలో తెలంగాణ ప్రాంతానికి నదీజలాల్లో జరిగిన అన్యాయాలను ట్రిబ్యునల్ లో గట్టిగా ఎత్తిచూపుతోంది.
ఈ నేపధ్యంలో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చేదాక కృష్టానదీజలాల్లో సమాన వాటా నీటివినియోగం కోసం తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతోంది. అంతే కాకుండా క్యారీ ఓవర్ నిటి వినియోగాలు, పట్టిసీమ ద్వారా కృష్టానదికి మళ్లించిన గోదావరి జలాల్లో ఎగువ రాష్ట్రంగా తెలంగాణకు లభించాల్సిన నీటి వాటా తదితర అంశాలను ప్రభుత్వం బోర్డు దృష్టికి తీసుకుపోయింది. ఈ అంశాలపైనే గట్టిగా వాదనలు వినిపించాలని సిఎం కేసిఆర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుల ఉమ్మడి సమావేశాలు ఇప్పటికే రెండు సార్లు నిర్వహించారు. ఈ సమావేశాలకు ఎపి నుంచి అధికారులు మాత్రమే హాజరయ్యారు.