Wednesday, January 22, 2025

తెలంగాణ అమ్మాయి మహిమ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

టేబుల్ టెన్నిస్ పోటీలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న యుటిటి నేషనల్ టేషనల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ పోటీలు ఆదివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫైర్‌ఫాక్స్ స్పోర్ట్ అండ్ రిసార్ట్ వేదికగా వైభవంగా ప్రారంభమయ్యాయి. హోరాహోరుఈగా సాగిన ఈ పోటీల్లో అండర్11, అండర్13 విభాగాల్లో నిర్వహించారు.

అండర్11 గర్ల్ విభాగంలో బెంగాల్‌కు చెందిన ఎస్.చక్రబోర్తి పుదుచెరికి చెందిన కె. వేదపై 31తో విజయం సాధించగా బాయ్స్ విభాగంలో కర్నాటకకు చెందిన నవరంగె అరవ్ మంగేశ్ గోవాకు చెందిన ప్రభుయుగ్‌ను 31తో ఓడించాడు. ఇక అండర్13 బాయ్స్ విభాగంలో ఆర్. అగార్వాల్(ఢిల్లీ), ఆర్ అరుణేశ్(పుదుచెరి)పై 31తో గెలుపొందాడు. గర్ల్ విభాగంలో తెలంగాణ అమ్మాయి సంచలన విజయం సాధించింది. బి. వెంకట మహిమక్రిష్ణ మహారాష్ట్రకు చెందిన ఎం. సంగెల్కర్‌ను 32తో మట్టికరిపించి ఘన విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News