Wednesday, January 22, 2025

హెల్త్ సైన్సెస్‌లో గ్లోబల్ హబ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోని టాప్-10 ఫార్మా కంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఆసియాలో అతిపెద్ద లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ సదస్సు 20వ ఎడిషన్ బయో ఏషియా సదస్సు శుక్రవా రం హెచ్‌ఐసిసిలో ప్రారంభమైంది. మూడు రో జుల జరుగనున్న ఈ సదస్సును మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. తొలిరోజు ప్రభుత్వ అ ధికారులు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మా ట్లాడుతూ తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫా ర్మా పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉందని చెప్పారు. ఇక్కడ 800కు పైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే మూడింట ఒకవంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి తెలంగాణలో జరుగుతున్నదని వెల్లడించారు.

దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30శాతం, ఎపిఐ ఉత్పత్తిలో 40శాతం, ఎపిఐ ఎగుమతుల్లో 50శాతం తెలంగాణ నుంచే జరుగుతున్నదని చెప్పారు. హై దరాబాద్‌లో బయో ఏషియా సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రి చెప్పారు. లైఫ్‌సైన్స్ రంగంలో ప్రపంచ హబ్‌గా హైదరాబాద్ అ వతరించిందని చెప్పారు. హైదరాబాద్ ఫార్మాసి టీ వరల్డ్ లార్జెస్ట్ హబ్‌గా నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు. గత ఏడేళ్లలోనే 3 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. నగరం లో 20కిపైగా లైఫ్‌సైన్సెస్, మెడ్‌టెక్ ఇంక్యుబేట ర్లు ఉన్నాయని తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వం లో అనేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. శాస్త్రవేత్తలు, మేధావులు ఏకమై వైద్య సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. 2023 కు గాను ‘జీనోమ్ వ్యాలీ’ ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రొ. రాబర్ట్ లాంగర్‌కు ప్రదానం చేయనున్నామని తెలిపారు.

‘అడ్వాన్సింగ్ ఫర్ ఒన్’ సహకార

‘కొవిడ్ -19’ మహమ్మారి ప్రతి ఒక్కరికీ సహకరించు కోవడంలోని ఆవశ్యకత, ప్రజా సంక్షేమం పై దాని ప్రభావాన్ని గురించి వెల్లడించిందని మంత్రి కెటిఆర్ అన్నారు. మానవ జాతికి అత్యం త ప్రమాదకరమైన ఆరోగ్య సవాల్‌ను అధిగమించడానికి ప్రపంచమంతా ఏకమైన వేళ అని గుర్తుచేశారు. బయో ఏషియా సదస్సు నేపథ్యమైన ‘అడ్వాన్సింగ్ ఫర్ ఒన్ ’ అనేది ఈ సహకారపు స్ఫూర్తిని కలిగిస్తుందని, మానవ జాతి వికాసాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. బయో ఆసియా ఎదుగుతున్న తీరు ఆనందకరంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం దేశంలో లైఫ్ సైన్సెస్ అభివృద్ధికి ఇది అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుందని మంత్రి కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు.

* లైఫ్ సైన్సెస్‌లో వంద బిలియన్ డాలర్ల లక్షం..

లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో రాష్ట్రం ‘ 2030 నాటికి ఈ రంగపు విలువను రెట్టింపు చేసి 100 బిలియన్ డాలర్లకు తీసుకువెళ్లాలనే లక్ష్యం చేసుకున్నామని మంత్రి కెటిఆర్ ఉద్ఘాటించారు. చాలామంది ఇది మరీ ఎక్కువ లక్ష్యమనుకుంటారు. అయితే 2022లోనే మేము లైఫ్‌సైన్సెస్ రంగంలో 80 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకున్నామని వెల్లడించేందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. ప్రస్తుత వేగంతో వెళ్తేనే, 2025 నాటికి మేము 100 బిలియన్‌డాలర్ల మైలురాయిని చేరుకోగలమనే నమ్మకంతో ఉన్నాం. షెడ్యూల్‌కు ఐదేళ్ల ముందే లక్ష్యం చేరుకోగలం. ఇది తెలంగాణాలో అసాధారణ వృద్ధి వేగానికి ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. రెండేళ్ల కాలంలో తెలంగాణలో ఈ రంగం 23 శాతం వృద్ధి నమోదు చేస్తుంది. అదే సమయంలో జాతీయ వృద్ధి కేవలం 14 శాతంగా మాత్రమే ఉంది” అని అన్నారు.

* హెల్త్ టెక్ కేంద్రంగా హైదరాబాద్..

ప్రపంచంలో అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ కేంద్రంగా తెలంగాణ వెలుగొందుతోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమ భవిష్యత్‌కు పునరాకృతి కల్పించే వినూత్న అవకాశాలు మాకు ఉన్నాయి. భారీ కలలు కనడమే కావాల్సింది. 2030 నాటికి, లైఫ్ సైన్సెస్ వ్యవస్థ విలువ 250 బిలియన్ డాలర్లు దాటి పోతుందని నా అంచనా. అంతేకాదు, ప్రపంచపు హెల్త్- టెక్ కేంద్రంగా హైదరాబాద్‌ను నిలిపేందుకు తగు కార్యక్రమాలను రూపొందించబోతున్నామని మంత్రి వెల్లడించారు. పలు ఇన్‌క్యుబేటర్ కార్యక్రమాల ద్వారా డీప్ కంప్యూటింగ్ వనరులతో ఆరోగ్య సంరక్షణ, సాంకేతికతను మిళితం చేయగలమని తెలిపారు.

* ఇక్కడ నైపుణ్యం అపారం.. ఇది మా కార్పొరేట్ సెంటర్ : వాస్ నరసింహన్

మా వాల్యూచైన్ వృద్ధి చేయబోతున్నాం. ఇక్కడ నైపుణ్యం అపారం. భారత్‌లో పెట్టుబడులు కొనసాగించే వారికి ఆహ్వానమని నొవార్టిస్ స్విట్జర్లాండ్ సిఇఒ డా. వాస్ నరసింహన్ అన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్ధ వృద్ధి గురించి ఆయన ప్రస్తావిస్తూ ‘15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ కెపాసిటీ సెంటర్ నిర్మించాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడది రెట్లు పెరిగింది. గత ఐదేళ్లలో మేము ఇక్కడ మా కార్యకలాపాలను రెట్టింపు చేశాం. మా అత్యంత కీలకమైన డ్రగ్ డెవలప్‌మెంట్, డాటా మేనేజ్‌మెంట్, పేషంట్ సేఫ్టీ, తయారీ కేంద్రాలు, ప్రొక్యూర్‌మెంట్, పీపుల్ మేనేజ్‌మెంట్, బహుళ సీనియర్ రోల్స్‌ను ఇక్కడకు తీసుకువచ్చాం. హైదరాబాద్ ఇక ఎంత మాత్రమూ నోవార్టిస్‌కు సర్వీస్ సెంటర్ కాదు, ఇది మా కార్పోరేట్ సెంటర్. ప్రపంచంలోని మూడు ముఖ్య కేంద్రాల్లో ఇది ఒకటి. దీని పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. సదస్సులో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్, యుకె సిఇఒ డాక్టర్ రిచర్డ్ హాట్చెట్, గ్లోబల్ డ్రగ్ డెవలప్‌మెంట్ సిఇఒ డాక్టర్ సమిత్ హిరావత్, యునిసెఫ్ ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ, డాక్టర్ మహేందర్‌నాయక్, డాక్టర్ సాయి డి. ప్రసాద్, వివిధ దేశాలకు ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News