Thursday, January 23, 2025

నేడు తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేడు విద్యార్థుల కోసం నిజాం కళాశాల మైదానంలో తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2023 నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొపెసర్ ఆర్. లింబాద్రి హాజరైతారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈనెల 2వ తేదీ నుంచి 4వ తేదీవరకు నిర్వహిస్తున్నట్లు ఈకార్యక్రమంలో పది, ఇంటర్మీయట్ తరువాత ఏ కోర్సులు ఎంచుకోవాలి, ఇంజనీరింగ్‌లో బ్రాంచి ఎంపికలో ఇబ్బంది పడుతున్నారా, ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్‌లో కళాశాల ఎంపికలో తికమక పడుతున్నారా, ఇంజనీరింగ్ ఏ కోర్సు చేస్తే ప్యూచర్ బాగుంటుందనే విషయాలపై సందేహాల పరిష్కారానికి ఒక చక్కటి వేదికను టీ న్యూస్ తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2023 నిర్వహిస్తుంది.

ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, ఓవర్సీస్, బిజినెస్ మేనేజ్‌మెంట్ కాలేజీల, యూనివర్శిటీల వివరాలను ఒకే చోట తెలుసుకునే అద్బుత అవకాశం ఈకార్యక్రమం ద్వారా తెలుసుకోవచ్చు. నిష్ణాణుతులైన ప్రముఖులతో మాక్ కౌన్సిలింగ్, సెమినార్స్, కెరీర్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.ఈకార్యక్రమం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వహకులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News