Monday, December 23, 2024

తెలంగాణ పాలన దేశానికి దిక్సూచి

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్: ఎండాకాలం వచ్చిందంటే తెలంగాణ లో పశువులు నీళ్లు దొరకని దుస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఉండేదని, ప్ర స్తుతం రాష్ట్రంలో ఒక్క చూసిన నీటి కళ, పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయ ని రాజేంద్రనగర్ శాసన సభ్యుడు టి. ప్రకాష్‌గౌడ్ అన్నారు. పెట్టుబడులకు నెలవుగా మారిన మన రాష్ట్రంలో తెలంగాణ పోలీసులు కల్పిస్తున్న భద్రత దేశానికే దిక్సూచి అని గుర్తు చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా సోమవారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని డైరీ ఫాం కూడలి నుంచి బుద్వేల్ ఎక్స్‌టెన్షన్ వరకు నిర్వహించిన 2కె రన్ ను ఆయన ఆర్డీవో చంద్రకళ, డిసిపి జగదీశ్వర్‌రెడ్డి తదితరులతో కలసి జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం డైరీ ఫాం నుంచి వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు, గురుకులాల విద్యార్థులతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, బిఆర్‌ఎస్ నాయకులతో కలసి రన్ చేశారు. అనంతరం ఎక్స్ టెన్షన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు రాష్ట్రం ఏలా ఉండేది..? ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఏవిధంగా అభివృద్ధి చెందిందో ప్రజలకు వివరించాలని సూచించారు.

అన్ని వర్గాల సంక్షేమం కోసం అనునిత్యం పరితపించే పాలకుడు మనకు ముఖ్యమంత్రి కావడం అదృష్టంగా బావిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు డీసీసీ జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధితో పాటు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాలతో తెలంగాణ పోలీసులు కల్పిస్తున్న భద్రత ప్రధాన అంశం అన్నారు. ప్రజలకు, వాణిజ్య, వ్యాపార, ఐటి సెక్టార్‌కు అనుక్షణం పోలీసులు సేవలందిండానికి సైబరాబాద్ పోలీసులు సిద్దంగా ఉం టారని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News