Thursday, January 23, 2025

బ్రిటీష్ రాణి మృతికి గౌరవసూచకంగా 11న తెలంగాణలో సంతాప దినం

- Advertisement -
- Advertisement -

 

Elizabeth II

హైదరాబాద్: బ్రిటీష్ రాణి క్వీన్ ఎలిజబెత్ -2 మృతి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు సంతాప దినాలను పాటిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలిజబెత్ రాణి గౌరవార్థం ఒక రోజు సంతాప దినాన్ని పాటించాలని నిర్ణయించింది. రేపు(సెప్టెంబర్ 11న) సంతాప దినాన్ని పాటించనున్నట్టు ప్రకటించింది. రాణి మరణం నేపథ్యంలో ఈ నెల 11ను సంతాప దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రేపు సంతాప దినాన్ని పాటించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని సగం వరకు అవతనం చేయాలని ఆదేశించారు. అంతేకాక రేపు అధికారికంగా ఎలాంటి వేడుకలను నిర్వహించకూడదని ఆదేశాలను జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News