Monday, January 20, 2025

పంచ విప్లవాలతో ప్రగతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఐదు రకాల విప్లవాలు ఆవిష్కరింపబడ్డాయని తద్వారా ఆర్థిక ప్రగతి సాధ్యపడిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో మహిళా పారి శ్రామికవేత్తల అంతర్జాతీయ వాణిజ్యం, సాంకేతిక కేంద్రంకు (డ బ్లూఇఐటిటిసి) పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ శుక్రవారం శంకు స్థాపన చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. గతంలో పారిశ్రామికవేత్తగా కెరీర్ ప్రారంభించాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారు కావచ్చన్నారు. మహిళలు అన్ని విష యాలను అవగాహన చేసుకుని ఏదైనా సాధించగలుగుతారు. తెలం గాణ ప్రభుత్వం మహిళల కోసం నందిగామ గాజులరామారంలో ప్రత్యేకంగా పార్కులు ఏర్పాటు చేసింది. తూప్రాన్ లో మరో పార్కు ఏర్పాటు చేశాం. వీటిని మహిళలు పరిశ్రమకవేత్తలు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. మహిళా సంఘాలు చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తున్నాయన్నారు.

సెర్ప్, మెప్మాల ద్వారా తెలంగాణలో వడ్డీ లేని రుణాలను ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ఐదు రకాల విప్లవాలు ఆవిష్కరించబడ్డాయన్నారు. దే శంలో అత్యధిక వరి రాష్ట్రంలో పండుతోందని, 46వేల చెరువులు పునరుద్ధరించబడ్డాయన్నారు. ఇవాళ చేపల పెంపకం తెలంగాణ ప్ర భుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున మాంస ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నామని, దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ముందుకెళ్తోందన్నారు. డైరీ రంగంలో కూడా తెలంగాణ అద్భుతంగా ముందుకు వెళుతుం దని, విజయ డైరీ ద్వారా రాష్ట్రంలో రైతుల నుంచి పాల సేకరణ జరు గుతుంది. పాల సేకరణ కాకుండా పాల ఉత్పత్తులన్నీ కూడా తెలం గాణ ప్రభుత్వం ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తుందని తెలిపారు. 20 లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో ఆయిల్ సాగు ఉత్పత్తికి శ్రీకారం చుట్టాం. విదేశాల నుంచి ఆయిల్ దిగమతి చేసుకునే దుస్థితి తప్పాలన్నారు. మన విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ఒక ఆదర్శం. అదిలాబాదులో ఆపి ల్స్ కూడా పండిస్తున్నారు.

మీ లక్ష్యం ఎప్పుడు చిన్నదిగా ఉండకూడ దన్నారు. తయారు చేయడంలో మహిళలు ముందుకురావాలని, అంతరిక్షంలో మహిళలు రావాలని, ఫ్రుడ్ ప్రాసెసింగ్ లో మహిళలు రావాలని.. అన్ని రంగాల్లో మహిళలు ఉన్నతకు స్థానంలోకి రావాలి. పెద్దగా ఆలోచించండి ఉన్నత స్థానానికి ఎదగాలని మహిళా పారిశ్రామికవేత్తలకు మంత్రి కెటిఆర్ సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయం, మత్స్య సంపద, పశుసంపద, పాడి పరిశ్రమ, ఎడిబుల్ ఆయిల్స్ ఉత్పత్తి విప్లవాలు ఏకకాలంలో తెలంగాణలో చాలా అవకాశాలను కల్పిస్తున్నాయని, చురుకైన వ్యాపార విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి ఉత్పత్తుల నిర్మాణానికి మద్దతు ఇవ్వడంపై రాష్ట్రం దృష్టి సారించిందన్నారు. ‘మార్కెటింగ్ హబ్‌ను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎంఎస్‌ఎంఇ డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ అదనపు అభివృద్ధి శాఖ కమిషనర్ డి.చంద్రశేఖర్ అన్నారు. ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని.. ఇది చాలా దూరం వెళ్లి మహిళా పారిశ్రామికవేత్తలందరికీ ఒకే-స్టాప్ షాప్‌గా ఎదిగే అవకాశం ఉందని తెలిపారు. ‘మూడు దశాబ్దాల క్రితం ఐదుగురు పారిశ్రామికవేత్తలతో ప్రారంభించిన ALEAP నేడు 10,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలను తన స్థాయిల నుండి ఉద్భవించింది. ఇతర రాష్ట్రాలు మరియు నగరాల నుండి ప్రజలు తమ వ్యాపారాన్ని నెలకొల్పడానికి హైదరాబాద్‌కు మారారు. ’మేక్ ఇన్ ఇండియా’ ప్రచారాన్ని విజయవంతం చేయడమే మా లక్ష్యం. నిజమైన అవకాశం‘ అని ALEAP ప్రెసిడెంట్ రమా దేవి కన్నెగంటి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News