Sunday, December 22, 2024

బంజారాల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చదువులను తండాలకు తీసుకెళ్లే బాధ్యత ప్రభుత్వానిదని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బంజారాభవన్‌లో సంత్ సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడారు. బంజారాల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తున్నామని, సేవాలాల్ జయంతి ఉత్సవాలకు రెండు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. తండాలలో ఎటువంటి సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకరావాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పడి 70 రోజులైనా ఏ ఒక్క రోజు తాము సెలవు తీసుకోలేదని, పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News