Monday, December 23, 2024

అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందంటే ఈ ఘ నత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెందుతుందని మల్కాజిగిరి శాసన సభ్యులు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్ ఉప కమిషనర్ జి.రాజు అధ్యక్షతన బాలాజీ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ సంక్షేమ సంబురాలు కార్యక్రమానికి ఎ మ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై బిసి రుణాలు కింద రూ 1 లక్ష రూపాయులకు ప్రొసిడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందచేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పాటు దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇళ్లు లేని పేదలకు ఇళ్ల స్ధలాలు, కంటి వెలుగు, వృద్ధాప్య, వితంతు పించన్లు, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, గృహలక్ష్మీ, గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్స్, నాయీ బ్రాహ్మణులకు, రజకులకు 250యూనిట్లు ఉచిత విద్యు త్, ఎస్సీ, ఎస్టీలకు 101యూనిట్లు, రైతులకు, పట్టణాలలో సైతం 24 గంటలపాటు విద్యుత్ సరఫరా, అసంఘటిత కార్మికుల సం క్షేమం కోసం అనేక పథకాలు, గృహాలక్ష్మీ పథకం కింద రూ 3 లక్షల ఆర్థిక సహాయం, జీఓ 58, 59 కింద ఇళ్ల క్రమబద్ధీకరణ తదితర సంక్షేమ పథకాలతో పేద, మధ్య తరగతి ప్రజల ఆర్ధికాభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, వారి సంక్షేమం కోసమే వినూత్న పథకాలతో ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, మేకల సునితరాముయాదవ్, కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎన్. జగధీష్‌గౌడ్, అల్వాల్ డీసీ నాగమణి, డీఆర్‌డిఏ యాదయ్య, బిసి లోన్ అధికారి పాండు, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి స్వాతి, పీవో మల్లికార్జున్, బిఆర్‌ఎస్ మల్కాజిగిరి అధికార ప్రతినిధి జీఎన్‌వీ సతీష్‌కుమార్, సర్కిల్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, రాముయాదవ్, ఉపేందర్‌రెడ్డి, బాబు, సత్యనారాయణ, సంతోష్ రాందాస్, తులసీ సురేష్,సత్తయ్య, బాలకృష్ణ గుప్తా, ఫరీద్, భాస్కర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News