Monday, January 20, 2025

తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాతి

- Advertisement -
- Advertisement -

నార్నూర్ : తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాతి అని జడ్పీ చైర్మన్ జనార్థన్ రాథోడ్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శి, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శ్రీ బానోత్ గజానంద్ నాయక్ అన్నారు. నార్నూర్ మండలకేంద్రంలో జరిగిన గిరిజనులకు పోడు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వంలో అం దని పథకాలు , జరగని అభివృద్ధ్ది బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిందన్నారు. పుట్టిన పసి పిల్లల నుండి చనిపోయే వారి వరకు కూడా ప్రభుత్వ పథకాలు అమలులో ఉన్నాయన్నారు. దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. కావున రాబోయే రోజుల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుందామని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, ఎఎంసీ వైస్ చైర్మన్ నాగోరావ్, పిఎసిఎస్ ఇంచార్జీ చైర్మన్ సురేష్‌ఆడే, ఎంపిటిసి పరమేశ్వర్, మెడి దుర్గు పటేల్, పిఎసిఎస్ డైరెక్టర్ల్ దుర్గా కాంతారావు, బిఆర్‌ఎస్ నాయకులు కొర్రల మహేంధర్, ఎంపిటిసిలు, నాయకులు , సర్పంచ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News