Sunday, December 22, 2024

ఆర్థిక దిద్దుబాటులో..

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వానికి పెనుభారంగా
పాత అప్పులు రుణాలు,
వడ్డీలు కలిపి సగటున రోజుకు
రూ.207కోట్లు ఖర్చు కిస్తీల
చెల్లింపునకే అధిక ప్రాధాన్యం
ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న
రేవంత్ సర్కార్ పదేళ్ల పరిస్థితిని
గాడిలో పెట్టేందుకు చర్యలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసిన పాత అప్పులు భారంగా మారాయి. అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సిఎం రేవంత్‌రెడ్డి తనవంతు కృషిని చేస్తున్నారు. గత ప్ర భుత్వం చేసిన అప్పులు, వడ్డీలు కలిపి తిరిగి చెల్లించేందుకు గడిచిన 125 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సగటున ఒక రో జుకు రూ.207 కోట్లు ఖర్చు పెట్టింది. గత ప్రభుత్వం ఇ బ్బడి ముబ్బడిగా చేసిన అప్పులకు వడ్డీలు, కిస్తీలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. ఆరు గ్యారంటీల అమలుతో పాటు మిగతా పథకాల కోసం తె చ్చిన కొత్త అప్పులకు వడ్డీలతో సహా కిస్తులను చెల్లిస్తూ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం గాడిలో పెడుతోంది. పదేళ్లుగా విధ్వంసమైన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోంది. దుబారా లేకుండా ప్రతి పైసాకు జవాబుదారీగా ఉండేలా ఖర్చులపై నియంత్రణను అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం కంటే ఎక్కువ కిస్తులు చెల్లించడంతో పాటు తెచ్చిన అప్పుల కంటే తిరిగి చెల్లింపులు ఎక్కువ చేసి ఆర్థిక క్రమశిక్షణను ప్రభుత్వం పాటిస్తోంది. గడిచిన పదేండ్లలో అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, నెలసరీ చెల్లింపులు తడిసి మోపడయ్యాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు డిసెంబర్ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్, బడ్జెటేతర రుణాలన్నీ కలిపి రూ. 17,618 కోట్ల అప్పులు చేసింది.

ఇదే వ్యవధిలో రూ.25, 911 కోట్లు అప్పులకు సంబంధించిన (అసలు, వడ్డీలు కలి పి కిస్తీలు) తిరిగి చెల్లింపులు చేసింది. అంతమేరకు తెలంగా ణ ప్రజలపై మోపిన రుణభారం తగ్గించింది. రాష్ట్ర ప్ర భు త్వం ఈ నాలుగు నెలల్లో తెచ్చిన కొత్త అప్పులు కూడా గ త ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు కూడా స రిపోలేదు. పదేళ్లలో రాష్ట్ర ఖజానాపై మోయలేనంతగా పెరిగిన రుణభారం తగ్గించేందుకు ప్రయత్నాలు చేసింది. వీటికి తోడుగా ప్రభుత్వం ప్రజోపయోగమైన నిర్మాణాలకు, పనులకు మరో రూ.5,816 కోట్లు మూలధన వ్యయంగా ఖర్చు చేసింది. గత ప్రభుత్వం చేసినట్లుగా ఇష్టారాజ్యంగా అప్పుల జోలికి వెళ్లకుండా ఈ ప్రభుత్వం నియంత్రణ పాటించింది. బడ్జెట్ పరిమితులకు లోబడి మార్కెట్ రుణాలు తీసుకొని ప్రణాళిక ప్రణాళికేతర ఖర్చులకు సరిపడేలా సర్దుబాటు విధానం అనుసరించింది. గతంతో పోలిస్తే అప్పులు తగ్గుముఖం పట్టడం శుభపరిమాణంగా చెప్పవచ్చు.

కొంతమేరకు అప్పులను నియంత్రించటంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు నాలుగు నెలల్లో రూ.15,968 కోట్లను ప్రభుత్వం అప్పులు తీసుకుంది. 2022-,23 సంవత్సరంలో ఇదే వ్యవధిలో రూ.19,569 కోట్లు, 2021-22లో అప్పటి ప్రభుత్వం రూ.26,995 కోట్ల అప్పులు తీసుకుంది. 2024,-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ. 59,625 కోట్ల రుణాలను ప్రభుత్వం అంచనా వేసింది. అందులో ఇప్పటివరకు కేవలం రూ.2,500 కోట్లు అప్పుగా తీసుకుంది. గతంతో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్‌డిపి) పెరిగినందున రుణాలు తీసుకునే పరిధి పెరిగింది. జీఎస్‌డిపి ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తక్కువ అప్పులు చేయటం కొత్త మార్పునకు సంకేతం. సాధారణంగా ప్రభుత్వాలు తాము చేసే రీపేమెంట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News