Saturday, December 28, 2024

క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి : కాలేరు

- Advertisement -
- Advertisement -

కాచిగూడ: క్రీడల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. మెడల్స్ సాధించిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తుందని, ఇది దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని ఆయన కొనియాడారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా క్రీడలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదని, ఆ ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందని అన్నారు. ఇటీవల ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగిన అంతర్జాతీ య స్విమ్మింగ్ పోటీలలో అంబర్‌పేట నియోజకవర్గం బర్కత్‌పురకు చెందిన గంధం క్విని విక్టోరియా రెండు రజత పతకాలు సాధించిన విషయం విధితమే.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆదివారం క్విని విక్టోరియాను శాలువ, పూలబోకేతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దక్షిణ భారతదేశము తరపున విక్టోరియా రెండు మెడల్స్ సాధించటం అభినందనీయం అన్నారు. వచ్చే అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలలో బంగారు పతకాన్ని సా ధించి తెలుగు ప్రజల కీర్తి పతకాన్ని నల దిశలా చాటి చెప్పాలని ఆయన కోరారు. గంధం క్విని విక్టోరియాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రీడారంగంలో అన్ని విధాలు గా సహాయ, సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాలల జెఏసి చైర్మన్ బి. దీపక్‌కుమార్, బిఆర్‌ఎస్ నాయకులు గెల్వ య్య, నర్సింగ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News