Friday, November 15, 2024

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

- Advertisement -
- Advertisement -

వి-హబ్ : దేశంలోనే తొలి కార్యక్రమం

Telangana Government Schemes

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం.
l వి హబ్ అంటే ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్ అని అర్థం.
l 2018 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభించారు.
l దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ..మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు విహబ్ కార్యక్రమం ప్రారంభమైంది.
l ఈ కార్యక్రమం ప్రధాన లక్షం మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థికంగా, సామాజికంగా ఉన్న అడ్డంకులను తొలగించడం, ప్రోత్సహించడం.
తెలంగాణ ప్రజలకు ఆసరా..
l ఆసరా అంటే సాయం అని అర్థం.
l వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేని వారి కోసం సాయంగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకమే ఆసరా..
l ఈ పథకం ద్వారా ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది.
l చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్‌ఐవీ ఎయిడ్స్ ఉన్న వారు ఈ పథకం నుంచి లబ్ది పొందుతున్నారు.
l ఈ పథకం నవంబర్ 8, 2014లో తొలుత రూ. 500 కోట్ల బడ్జెట్‌తో అమల్లోకి వచ్చింది.
l సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తూరులో ఈ స్కీమ్ ప్రారంభించారు.
ఆసరా స్కీమ్ వివరాలు:
l స్కీమ్‌పేరు తెలంగాణ రాష్ట్ర ఆసరా పెన్షన్
l ప్రారంభించిన తేది: నవంబర్ 8, 2014
డిపార్ట్ మెంట్ : రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్ మెంట్
ప్రయోజనం: ప్రతినెలా లబ్దిదారులకు ఆర్థిక సాయం
ప్రధాన ఉద్దేశ్యం: పేదలకు మెరుగైన జీవనాన్ని అందిచడం.
అర్హులు వీరే: ఆసరా పెన్షన్ పథకంలో 57 ఏళ్ల వయసు నిండిన వారికి రూ. 2,016 వృద్ధాప్య పెన్షన్ అందిస్తారు.
l ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం అర్హులందరికీ ఈ స్కీమ్ ద్వారా ఆసరా పించన్లు అందిస్తారు.
l ప్రస్తుతం దివ్యాంగులకు నెలకు రూ. 3016 అందిస్తారు. వృద్దాప్య పించన్లతోపాటు ఇతర అన్ని రకాల లబ్ది దారులకు రూ. 2016 అందిస్తారు.
రైతు బంధు..

l గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తి మరింత ప్రోత్సహించి, రైతుల ఆదాయం పెంచేందుకు.. పెట్టుబడి సాయంగా నగదును అందిస్తున్న పథకమే రైతు బంధు.
l 201819 ఖరీఫ్ నుంచి రైతులకు పెట్టుబడిని ప్రభుత్వం అందిస్తుంది.
l ప్రతీ ఎకరానికి ఒక్కో రైతుకు ప్రతి సీజన్‌లో రూ. 5000 చొప్పున రైతుల అకౌంట్లోకి ప్రభుత్వం జమచేస్తుంది.
l ఇలా రెండు పంటలకు కలిపి చూస్తే రూ. 10వేలు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందుతుంది.
l రైతులకు మద్దతునిచ్చేందుకు భారత్‌లో ప్రవేశపెట్టిన తొలి పెట్టుబడి పథకం ఇదే కావడం విశేషం.
రైతు బంధు వివరాలు..
l పథకం పేరు రైతు బంధు (అగ్రికల్చర్ ఇన్వెస్ట్ మెంట్ సపోర్టు స్కీమ్)
l ఉద్దేశ్యం ప్రతి రైతుకి ఖరీఫ్, రబీ సీజన్‌లలో ఒక్కో ఎకరానికి రూ. 5000, మొత్తంగా రూ. 10వేలు అందించటం.
l ఫిబ్రవరి 25, 2018న జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతుల సమన్వయం కమిటీలో సీఎం కేసీఆర్ ఈ పథకం ప్రకటించారు.
l మే 10, 2018న కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నియోజకవర్గంలోని ధర్మరాజుపల్లి గ్రామంలో అధికారికంగా రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

 

హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ 202223 విద్యా సం వత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుం చి స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. స్కూల్ విద్యార్థులతోపాటు అండర్ గ్రాడ్యుయేషన్, పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కూల్ ప్రోగ్రాం..
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో 112 తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
స్కాలర్‌షిప్: 16వ తరగతి వరకు రూ. 15,000, 712వ తరగతి వరకు రూ. 18—-000 చెల్లిస్తారు.

అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారు అర్హులు. 10, 12వ తరగతి,డిప్లొమా చేస్తున్న వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు.
స్కాలర్‌షిప్ : డిప్లొమా వారికి రూ. 20,000..అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు రూ. 30,000..ప్రొఫెషనల్ కోర్సులు రూ. 50,000 చెల్లిస్తారు.

పీజీ ప్రోగ్రాం
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ /పీజీ చదువుతున్న వారు అర్హులు.
స్కాలర్‌షిప్ : పీజీ కోర్సులు చేస్తున్న వారికి రూ. 35,000..ప్రొఫెషనల్ పీజీ కోర్సులు..రూ. 75000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అభ్యర్థుల కుటుంబ ఆర్థి క అంశాలను పరిగణనలోకి తీసుకుని, సం స్థ నిబంధనల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరితేది: ఆగస్టు 31, 2022.
వివరాలకు వెబ్‌సైట్: https://www.buddy4study.com

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News