Monday, December 23, 2024

రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం వలిగొండ మండలం ప్రొద్దుటూరు క్లస్టర్ రైతు వేదికలో నిర్వహించిన రైతుల ప్రత్యేక సమావేశానికి హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతులకు అండగా నిలిచిందన్నారు. పంట పెట్టుబడికి రైతుబంధు ద్వారా సహాయం, రైతు బీమా, ఉచిత విద్యుత్ మరెన్నో పథకాల ద్వారా రైతులను ఆదుకుందన్నారు.

గత కాంగ్రెస్ పాలకుల హాయ ంలో తెలంగాణలో ఎరువుల కోసం రైతులు ఏ దుకాణానికి వెళ్లిన చెప్పులు లైన్లో దర్శనం ఇచ్చేయి అన్నారు. రోజుల తరబడి లైన్లో నిలుచున్న రైతులకు ఎరువులు దొరికేవి కావన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి తెలంగాణకు వచ్చే ఎరువుల వాటాను పెంచి సకాలంలో రైతులకు ఎరువుల అందించి న ఘనత కెసిఆర్‌ది అన్నారు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులను అక్కున చేర్చుకొని చూస్తుంటే… రైతాంగ సమస్యలపై, వ్యవసాయరంగంపై ఎలాంటి అవగాహన లేని రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే విద్యుత్ పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోని రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, మండల కోఆర్డినేటర్ పడమటి మమతారెడ్డి, ఆయా గ్రా మా ల పరిధిలోని సర్పంచులు,ఎంపీటీసీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News