Friday, November 22, 2024

భారీ ప్రక్షాళన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం అధికారయంత్రాంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఒకే రోజు 13మంది ఐఎఎస్, ము గ్గురు ఐఎఫ్‌ఎస్, 70మంది డిప్యూటీకలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా త్రిపాఠి, రంగారెడ్డి కలెక్టర్‌గా నారాయణ రెడ్డి, యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత రావు, మున్సిపల్ శాఖ డైరెక్టర్‌గా టికె శ్రీదేవి, సిసిఎల్‌ఏ డైరెక్టర్‌గా మందా మకరందు, ఐ అండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్‌గా ఎస్. హరీష్,నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా దిలీప్ కుమార్, టూరిజం డైరెక్టర్‌గా హనుమంతు, ఆర్ అండ్ ఆర్, భూసేకరణ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శిగా ఆయేషా మస్రత్ ఖన్నం, వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా నిఖిల్ చక్రవర్తి, డెయిరీ కార్పొరేషన్ ఎండిగా చంద్రశేఖర్ రెడ్డి, క్రీడాశాఖ డైరెక్టర్‌గా సోని బాలాదేవీ, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఎండిగా కొర్రా లక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఎండిగా ఎన్. క్షితిజ, జీహెచ్‌ఎంసీ అర్బన్ ఫారెస్ట్రీ అదనపు కమిషనర్‌గా సుభద్రాదేవి, వికారాబాద్ ఎఫ్‌డిఓగా జి.జ్ఞానేశ్వర్లకు బాధ్యతలు అప్పగించారు.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నేపథ్యంలోనే సోమవారం ఏకంగా 70 మంది డిప్యూటీ కలెక్టర్లు , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ అయ్యారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రెవెన్యూ సంఘాలు పదోన్నతులు, బదిలీలపై మంత్రికి మొర పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు అధికారులకు స్థానచలనం కలిగించినట్టు రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బదిలీల్లో భాగంగా పలువురు అదనపు కలెక్టర్లు ఆర్డీఓలు, భూ సేకరణ అధికారులు, సివిల్ సప్లయ్ వంటి శాఖల్లో పని చేస్తున్న రెవెన్యూ అధికారులను బదిలీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా వెయిటింగ్‌లో ఉన్న పది మంది (కె.సురేష్, జీవకర్ రెడ్డి, కె.వెంకట ఉపేందర్ రెడ్డి, టి.పద్మావతి, జి.వెంకటేశ్వర్లు, జి.అంబాదాస్, రాజేశ్వర్, కె.స్వర్ణలత, రాథోడ్ రమేష్, జి.శ్రీనివాస రావు)లకు ఆర్డీఓలు పోస్టింగ్స్ లభించాయి.

మరికొందరికి ఊహించని విధంగా దూరంగా బదిలీ కాగా, మరికొందరికి ఊహించని స్థానం దక్కడంతో వారంతా సంతోషంలో మునిగిపోయారు. అయితే ఇందులో కొందరు ఫైరవీలు చేసిన వారికి ఆశించిన స్థానాలు దక్కకపోవడంతో వారంతా నిరాశలో మునిగిపోయారు. అయితే ఈ బదిలీల్లో భాగంగా గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు వచ్చిన కొందరు అధికారులకు ఊహించని విధంగా ప్రాధాన్యత కలిగిన డివిజన్‌లు లభించడం విశేషం. అయితే డిప్యూటీ కలెక్టర్లు ఎల్.రమేష్, ఎన్.ఆనంద్ కుమార్, వి.హనుమా నాయక్‌లకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. వారిని రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. ఈ మేరకు సోమవారం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రా విస్తరణ, కొత్త ఆర్‌ఓఆర్ చట్టం, ధరణి స్థానంలో భూమాత, పెండింగ్ భూ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ స్థలాల రక్షణ వంటి అనేకాంశాల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News