Wednesday, January 22, 2025

కూత పెట్టాడు…ఆట ఆడాడు : మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

 

ఆటలు ఆరోగ్యాని ఇస్తాయని చదువుతో పాటు ఆటలు ముఖ్యమని , తెలంగాణ ప్రభుత్వం ఆటలను బాగా ప్రోత్సహిస్తుందని మన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం, వావిలాల గ్రామంలో మూడు రోజులపాటు జరిగే జిల్లాస్థాయి కబడ్డీ ఆటలను నేడు మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కబడ్డీ..కబడ్డీ అంటూ కూతబెట్టి, ఆట ఆడారు. కబడ్డీ ఆటలోనూ, వాలీబాల్ ఆటలోనూ, ఫుట్బాల్ ఆటలోనూ కెప్టెన్ గా ఉన్నానని, ఆటలంటే తనకు చాలా ఇష్టమని అందుకే ఆరోగ్యంగా ఉన్నానని, మీరు ఆటలను ఆడాలని, ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రానికి పేరు తేవాలని వారిలో స్ఫూర్తిని రగిలించారు. ఆటల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే 40 టీంలు క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

క్రీడల్లో ఉండాలని అపుడే ఆరోగ్యంగా ఉంటామని చదువు ఎంత ముఖ్యమో…క్రీడలు అంతే ముఖ్యమని పేర్కొన్నారు. కబడ్డీ, వాలీబాల్, ఫుట్ బాల్ ఆటల్లో కెప్టెన్ గా ఉండేవాన్ని అని , అప్పట్లో వాలీబాల్ జిల్లా స్థాయి అధ్యక్షుడుగా తాను, ప్రధాన కార్యదర్శిగా కడియం శ్రీహరి ఉన్నామని తెలిపారు. దేవరుప్పులకు కబడ్డీ టీమ్ గా వచ్చి వరంగల్ జిల్లా కబడ్డీ జట్టు ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చిందని అన్నారు .

ఎమ్మెల్యేలకు కూడా ఆటలు ఆడిస్తారని, ఆ పోటీలలో అన్ని ప్రైజ్ లు నాకే వచ్చేవని ఎర్రబెల్లి వివరించారు. సిఎం కెసిఆర్ తెలంగాణలో కబడ్డి క్రీడను ప్రోత్సహించాలని, ఆటలను ప్రోత్సహించాలని, ప్రతి ఊరిలో క్రీడల కోసం ఎకరం భూమి కేటాయించి, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారని తెలిపారు. 3500 ఏళ్ల కింద వాల్మీకి వల్మిడి గుట్ట మీద రామాయణం రాశారని, వల్మిడినీ రూ.20 కోట్లతో అభివృద్ది చేశామన్నారు.

శ్రీరామ నవమి రోజున ప్రారంభం చేస్తున్నామన్నారు. మీరు తలంబ్రాలు తీసుకుని ప్రతి ఇంటి నుంచి రావాలని కోరారు. బమ్మెరలో పోతన పుట్టాడు. భాగవతం రాసింది పోతన వీళ్ళు మన దగ్గర ఉండడం మన అదృష్టమని హర్షం వ్యక్తం చేశారు.
ఆది కవి సోమనాథుడు. 10 కోట్ల ఖర్చుతో సోమ నాథుని విగ్రహం 22 అడుగుల ఎత్తుతో పెడుతున్నామని తెలిపారు.

వావిలాలకు చరిత్ర ఉంది. మన చరిత్రను కాపాడుకోవాలని ఎర్రబెల్లి తెలిపారు. ఓడిపోతే బాధ పడకుండా ఛాలెంజ్ గా తీసుకుని ఆడాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, సర్పంచ్ గంట పద్మ భాస్కర్ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News