హైదరాబాద్ : రోగులకు నిస్వార్థంగా, అవిశ్రాంతంగా సేవలు అందించే వారు డాక్టర్లని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. జులై 1 నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు ఆమె ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ల సేవలను కొనియాడారు. కోవిడ్19 సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా డాక్టర్లు అందించిన సేవలను మరువలేమని చెప్పారు. ఎంతో రిస్క్ తీసుకుని కోవిడ్ రోగులను కాపాడేందుకు వారు పని చేశారని అన్నారు. అదే కమిట్‌మెంట్‌తో డాక్టర్లు తమ వృత్తిలో పునరంకితం కావాలన్నారు. ప్రతి సంవత్సరం జులై 1న డాక్టర్స్ డేగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి డాక్టర్ బిధన్ చంద్రరాయ్ వర్ధంతి, జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ప్రాణాలను కాపాడే డాక్టర్లను స్మరించుకోవడం, వారి సేవలను గుర్తు చేసుకోవడం, వారి అమూల్యమైన సేవలను గుర్తుచేసుకోవాలన్నారు. ప్రాణాలను కాపాడే డాక్టర్లకు విధేయులుగా ఉండడం, వారి సేవలను శ్లాఘించాలన్నారు.
నిస్వార్థ సేవకులు డాక్టర్లు : గవర్నర్ తమిళిసై
- Advertisement -
- Advertisement -
- Advertisement -