Monday, December 23, 2024

బడి బలోపేతం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంగన్‌వాడీ పాఠశాలల్లో ప్లేస్కూ ల్ తరహాలో మూడో తరగతి వరకు బోధించేందుకు ప్రణాళికలు చేయాలని తెలిపారు. అంగన్‌వాడీల్లో విద్యాబోధనకు అదనంగా మరో టీచర్‌ను నియమించాలని సిఎం సూచించారు. నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునేలా ప్రణాళికలు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గ్రామాల నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా ఏర్పాట్లు ఉండాలని ఈ సందర్భంగా సిఎం అన్నారు.

మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం : కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ నమూనాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనార్టీ, జనరల్ గురుకులాలన్నీ ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం వేగంగా చేపట్టాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో సుమారు 20 ఎకరాల్లో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా సదుపాయాలు కల్పించాలని సిఎం తెలిపారు.

విద్యార్థులకు అన్ని వసతులు : విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక ఒకటి రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఎం అధికారులకు చెప్పారు. ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్‌ఆర్ నిధులు సేకరించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. సమావేశం అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమీకృత గురుకులాల నిర్మాణం కోసం వారం రోజుల్లో డిజైన్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే డిజైన్ ఉండాలని తెలిపారు.

49 స్కూళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం : సిఎస్‌కు తెలిపిన అధికారులు
రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలల ఏర్పాటు కోసం భూముల గుర్తింపు, ఇతర మౌలిక సదుపాయాల కోసం తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి దార్శనికత మేరకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలు, తల్లిదండ్రులు తమ పిల్లలను కలవడానికి ప్రత్యేక గది మొదలైనవి ఉండాలని, ఈ భవనాలన్నింటికీ ఏకరీతి డిజైన్‌ను వారంలోగా సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ సలహాదారుతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఈ ప్రాజెక్ట్‌కి నోడల్ ఆఫీసర్‌గా, ఇతర సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. 49 రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, అందులో ఎనిమిది పాఠశాలలు ఈ ఏడాది గ్రౌండింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 31 రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు భూమిని గుర్తించగా మిగిలిన 10 పాఠశాలలకు సంబంధించి భూమి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్ రాజు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఎస్‌సి అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, టిఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి అలుగు వర్షిణి, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం : విద్యావేత్తలతో సిఎం
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని చెప్పారు. దశలవారీగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. శుక్రవారం సచివాలయంలో ప్రముఖ విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ సమస్యలను,

విద్యావ్యవస్థలో లోపాలను విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. రెసిడెన్షియల్ స్కూల్స్‌తో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించనున్నామని సిఎం పేర్కొన్నారు. పదేళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలు లేవని విద్యావేత్తలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. యూనివర్సిటీలకు డెవలప్మెంట్ గ్రాంట్స్ కేటాయించాలని కోరారు. విద్యా, వ్యవసాయ రంగాల సమస్యల పరిష్కారానికి త్వరలో విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. విద్యా కమిషన్ ద్వారా విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఉండేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం వేగంగా చేపట్టాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో సుమారు 20 ఎకరాల్లో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా సదుపాయాలు కల్పించాలని సిఎం తెలిపారు.
విద్యార్థులకు అన్ని వసతులు

: విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక ఒకటి రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఎం అధికారులకు చెప్పారు. ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్‌ఆర్ నిధులు సేకరించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. సమావేశం అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమీకృత గురుకులాల నిర్మాణం కోసం వారం రోజుల్లో డిజైన్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే డిజైన్ ఉండాలని తెలిపారు.

49 స్కూళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం : సిఎస్‌కు తెలిపిన అధికారులు
రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలల ఏర్పాటు కోసం భూముల గుర్తింపు, ఇతర మౌలిక సదుపాయాల కోసం తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి దార్శనికత మేరకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలు, తల్లిదండ్రులు తమ పిల్లలను కలవడానికి ప్రత్యేక గది మొదలైనవి ఉండాలని, ఈ భవనాలన్నింటికీ ఏకరీతి డిజైన్‌ను వారంలోగా సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ సలహాదారుతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఈ ప్రాజెక్ట్‌కి నోడల్ ఆఫీసర్‌గా, ఇతర సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. 49 రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, అందులో ఎనిమిది పాఠశాలలు ఈ ఏడాది గ్రౌండింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 31 రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు భూమిని గుర్తించగా మిగిలిన 10 పాఠశాలలకు సంబంధించి భూమి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్ రాజు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఎస్‌సి అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, టిఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి అలుగు వర్షిణి, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News