Monday, November 25, 2024

ప్రభుత్వ బడులకు పూర్వవైభవం

- Advertisement -
- Advertisement -

2024- 25 విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీ ప్రారంభించనున్న దృష్ట్యా బడులు ప్రారంభం అయ్యేలోగా ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. పంచాయతీ రాజ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్వయం సహాయక సంఘాలు, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో ఎలక్ట్రీషియన్, కూలిన గోడలను పునః నిర్మాణం, కూలడానికి సిద్ధంగా ఉన్న పాఠశాలల ప్రహారీ గోడల నిర్మాణం, పేయింటింగ్ ఇతర మౌలిక సదుపాయాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శ అమ్మ పాఠశాలల పేరిట 2024- 25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించడం అభినందించదగిన విషయం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో దశాబ్దాలుగా పేయింట్స్ లేకపోవడం, గోడలు పర్రెలు పర్రెలుగా ఊడిపోవడం, ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో భవనాలు శిథిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలిపోతాయో తెలియని భయాందోళన పరిస్థితులలో కాలం గడిపేవారు. ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో టాయిలెట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు అడ్వాన్స్ గా రూ. 125 కోట్లు విడుదల చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్, పాఠశాలలలో సరైన సదుపాయాలు లేకపోవడంతో పేద, బడుగు, బలహీన, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ విద్యార్థులను వేలకు వేలు ఫీజుల రూపంలో చెల్లించి ప్రైవేటు పాఠశాలలకు పంపేవారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు, సైన్స్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, సాంఘిక శాస్త్రం చిత్ర పటా లు, గ్లోబులు, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయడం వల్ల అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను వదిలి ప్రభుత్వ, ఉన్నత రాజ్ పాఠశాలల్లో చేరుటకు మక్కువ చూపుతున్నారు.

2024- 25 విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీ ప్రారంభించనున్న దృష్ట్యా బడులు ప్రారంభం అయ్యేలోగా ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. పంచాయతీ రాజ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్వయం సహాయక సంఘాలు, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో ఎలక్ట్రీషియన్, కూలిన గోడలను పునః నిర్మాణం, కూలడానికి సిద్ధంగా ఉన్న పాఠశాలల ప్రహారీ గోడల నిర్మాణం, పేయింటింగ్ ఇతర మౌలిక సదుపాయాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

గత ప్రభుత్వా లు ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి నిర్లక్ష్య, నిర్లిప్తత వలన ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల విద్యార్థులను రెసిడెన్షియల్ పాఠశాలలు ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు అంటూ ప్రారంభించి చేర్పించడం వలన ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు లేకపోవడం వలన విద్యా వ్యవస్థ కుంటుపడిపోయింది. బడులు ప్రారంభించే లోగా ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు చేయాలి.

ఎన్నికల కోడ్ జూన్ 4 వ తేదీ వరకు ఉండడం వల్ల కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) అనుమతి తీసుకొని వీలైనంత త్వరగా ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు షెడ్యూల్ విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత పరిపాలనపై దృష్టి కేంద్రీకరిస్తానని చెప్పడం విద్య, వైద్యానికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానని అనడంతో ఉపాధ్యాయులు ఎంతో సంతోషిస్తున్నారు. గతంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు స్టే ఇవ్వడం వలన ఆగిపోయింది. కేసు పూర్వాపరాలు పరిశీలించి వాద వివాదాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వానికి సూచనలు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఉన్న కేసులన్నీ ప్రభుత్వ అనుకూలంగా తీర్పులు వచ్చాయి.

ఇప్పుడు బంతి ప్రభుత్వ కోర్టులో ఉంది. గతంలో జిఒ 317 స్థానికేతర సమస్యలు, స్ఫౌజ్ కేసులు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలకు పాయింట్లు కేటాయించడం, పదోన్నతుల కోసం టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత, భాషా పండితుల పోస్టులు భాషా పండితులకే ఇవ్వాలని, రంగారెడ్డి జిల్లా లో స్థానికులు స్థానికేతరులు మారడం, సీనియర్ ఉపాధ్యాయులు జూనియర్ ఉపాధ్యాయులుగా మారిన కేసులు మొదలైన అనేక సమస్యలకు పరిష్కారం తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ద్వారా లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, బడులు ప్రారంభం అయ్యేలోగా పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

డా. ఎస్. విజయ భాస్కర్
9290826988

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News