Sunday, January 5, 2025

నేడు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సావిత్రిబాయి పూలే జయంతిని ఇకమీదట మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 3న రాష్ట్రవ్యాప్తం గా సావిత్రిబాయి ఫూలే జయంతిని అధికారికం గా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా విద్య కోసం సావిత్రిబాయి పేలే చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ప్రతి ఏ టా ఆమె జయంతిని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తం గా నిర్వహించబోతోంది. సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ మహనీయురాలి స్ఫూర్తిగా మహిళలను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సీతక్క అన్నారు. దేశ తొలి ఉపాధ్యాయురాలిగా మహిళలు చదువుకుంటేనే ఆ ఇంటికి వె లుగు అని చాటిన ధీశాలి సావిత్రి భాయ్ పులే అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు.

సావిత్రిబాయి పూలే సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా నిలబడి దేశంలో మొదటి మహిళా పాఠాలకు పునాదులు వేశారన్నారు. ఆ మహనీయురాలి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయం తీసుకోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.సావిత్రి భా యి పూలే జ న్మదినాన్ని ‘మహిళా ఉపాధ్యాయుల ది నోత్సవంగా ప్రకటించడం- హర్షణీయమని ఎంఎల్ సి అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్ర భుత్వం సావిత్రి భాయి పూలే జయంతి జనవరి 3 ను మహి ళా ఉ పాధ్యాయుల దినోత్సవంగా ప్రకటిస్తూ జి.ఓ జారీ చేయడాన్ని అభినందించారు. ఇది సముచిత ని ర్ణయమని, దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఈ డిమాండ్ చేస్తోందని ఆయనన్నారు.

ఘనంగా నిర్వహించాలి: యూటిఎఫ్
సావిత్రిబాయి ఫూలే జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ, ప్రతి సంవత్సరం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల టిఎస్ యుటిఎ ఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి వెంకట్ హర్షం ప్రకటించారు..
ఇది బిసిల పోరాట విజయం : జాజుల
సావిత్రి బాయీ పులే జయంతి జనవరి 3న రాష్ట్ర ప్రభుత్వం మహి ళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ జిఓ జారీ చేయడాన్ని బి సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్వాగతించారు. ఇది బిసిల పోరాట విజయంగా భావిస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News