Monday, January 13, 2025

మెడికల్ అడ్మిషన్ల స్థానికతపై ‘సుప్రీం’కు తెలంగాణ సర్కార్

- Advertisement -
- Advertisement -

మెడికల్ అడ్మిషన్లపై స్థానికత రిజర్వేషన్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ అడ్మి షన్లకు స్థానికత వ్యవహారంపై సుప్రీంకోర్టును తెలంగాణ సర్కార్ ఆశ్రయించింది. తెలంగాణ శాశ్వత నివాసులు రాష్ట్రం బయట చదువుకున్నంత మాత్రాన స్థానిక రిజర్వేషన్ వర్తించదన్న ప్రభుత్వ నిబంధనను కొట్టివేస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణలో చదువుకో లేదనే కారణంతో ఎంబిబిఎస్,

బిడిఎస్ అడ్మిషన్ నిరాకరించరాదని ఆదేశాల్లో హైకోర్టు వెల్లడించింది. ఈ మేరకు తాజాగా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వద్ద తెలంగాణ తరఫు న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ మెన్షన్ చేశారు. పిటిషన్‌ను త్వరలోనే విచారణ జాబితాలో చేరుస్తామని సిజెఐ డివై చంద్రచూడ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News