Wednesday, January 22, 2025

కులగణనకు సై

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కుల గణన తీ ర్మానానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో శుక్రవారం బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుల గణనపై తీర్మా నం ప్రవేశపెట్టారు. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యు లు చర్చించారు. తీర్మానంపై చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు. సమగ్ర కుల గణనకు రా ష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. సమగ్ర కుల గణన తీర్మానాన్ని శాసన సభ ఏక్రీవంగా ఆమోదించిన ఈరోజు తెలంగాణకు చరిత్రాత్మక దినమని మంత్రి పొన్నం ప్రభాకర్ అభివర్ణించా రు. కుల గణన తీర్మానానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డికి, ఉప ము ఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు, సహచర మంత్రు లు, వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్‌లకు, ఎంఎల్‌ఎలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు..

డోర్ టూ డోర్ కుల గణనకు యావత్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుండటం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగీదారి అని తమ నాయకుడు రాహుల్ గాంధీ పిలుపునకు అనుగుణంగా రాష్ట్రంలో కుల గణనకు శ్రీకారం చుట్టడం ఆ తీర్మానాన్ని మంత్రిగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టడంతో తన జీవి తం దన్యమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి, ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీకి, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, ప్రియాంక గాంధీకి, ఎఐసిసి తెలంగాణ ఇంఛార్జ్ దిపాదాస్ మున్షీలకి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. మని షి జబ్బును తెలుసుకునేందుకు ఏ రకంగా ఎక్స్ రే ఉపయోగపడుతుందో
సమగ్ర కుల గణన సైతం సమాజంలోని కులాల స్థితి గతులను తెలియజెప్పుతుందని కాంగ్రెస్ నాయకత్వం మొదటి నుండి చెబుతూ వస్తుందని తెలిపారు.

డోర్ టూ డోర్ సమగ్ర కుల గణనకి తమ పార్టీ కట్టుబడి ఉందని చెబుతూనే ఉన్నామన్నారు. మేమెంతో మాకంత దక్కుతుందని ఈ తీర్మానం ద్వారా వ్యక్తం అవుతుందని చెప్పారు.ఈ కుల గణన అట్టడుగు వర్గాలలో కొత్త వెలుగులు తీసుకొస్తుందిదశాబ్దాలుగా వెనుకబడిన తరగతులు సామాజిక, విద్య, ఉద్యోగ,రాజకీయాల్లో వెనుకబాటుకు గురవుతుండడం, అత్యధిక సంఖ్యలో జనాభా ఉన్నప్పటికీ సరైన న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ పార్టీ భావించిందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతుల కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానించిందని, ఈ కుల గణన కాంగ్రెస్ సామాజిక న్యాయ సూత్రం ప్రకారం సమాజంలో అట్టడుగు బడుగుబలహీన వర్గాలు, దళిత ,గిరిజన,మైనారిటీ, బిసి వర్గాల్లో జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తుందనీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఏకగ్రీవంగా డోర్ టూ డోర్ కుల గణనను ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీకి కుల గణనకు మద్దతు ఇచ్చిన ప్రజా సంఘాలు, బిసి నేతలు, మేధావి వర్గానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇది అతి పెద్ద నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇది అతి పెద్ద నిర్ణయమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, బలహీనవర్గాల శాసన సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండాలి.. అందరికీ న్యాయం జరగాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేవమని పేర్కొన్నారు. విద్య, ఆర్థిక రాజకీయ స్థితిగతులు మెరుగుపడాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కుల గణన విధివిధానాలను సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో పాటు బలహీనవర్గాలకు న్యాయం జరగాలని ఆకాంక్షించేవారి సహకారం తీసుకుంటామని చెప్పారు. ఎక్కడా వివక్ష పూరితంగా వ్యవహరించమని, రాజకీయ అంశాలను తీసుకోమని స్పష్టం చేశారు. బలహీనవర్గాలకు న్యాయం జరగాలన్నదే మా పార్టీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. 2011 ఢిల్లీలో కేంద్రం చట్టం చేసిందని, ఒబిసి పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా తాను ఈ దేశంలో 20 రాష్ట్రాలు తిరిగానని పేర్కొన్నారు. మురళీధర్ కమిషన్ కార్యక్రమం తీసుకున్న సమయంలో మండల్ గెలవాలని పోరాడామని, 2011లో ఎలాంటి చట్టం చేయకుండానే కుల గణన జరిగిందని అన్నారు.

కుల గణన విషయంలో చట్టానికి కంటే చిత్తశుద్ధి ముఖ్యమని వ్యాఖ్యానించారు. బీహార్, ఆంధ్రప్రదేశ్,కర్ణాటకలో ఎక్కడ కూడా చట్టం చేయలేదని పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో స్థానిక సంస్థల రిజర్వేషన్‌లకి సంబంధించి ఇంకా కేసులు ఉన్నాయని అన్నారు. గుజరాత్‌లో బిసిలకు 35 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిందని, ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయట పెట్టాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అనేక కుల ఫెడరేషన్‌లు వేశారని, ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయని కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. 2014 -23 వరకు తొమిదిన్నరేళ్లలో 23 వేల కోట్లు ఖర్చు తప్ప ఏమి లేదని అన్నారు. ఎంబిసిలకు సంబంధించి ఆర్భాటంగా వెయ్యి కోట్లు ప్రకటించారు తప్ప వెయ్యి రూపాయలు కూడా ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. బలహీన వర్గాల శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులను పిలిచి మాట్లాడతామని చెప్పారు.

కులగణన ఇంటింటికి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఎలాంటి సమాచారం తీసుకుంటే బాగుంటుందని అందరి సలహాలు తీసుకుంటున్నామని తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయం ఏదైనా ఇబ్బంది ఉన్న ప్రతిపక్షాలకు ప్రశించే హక్కు ఉందని అన్నారు. పారదర్శకంగా చరిత్రలో ఉండే విదంగా తమ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన విధంగా కులగణన చేస్తున్నామని తెలిపారు. బలహీనవర్గాలకు చెందని వ్యక్తి ప్రధానిగా ఉన్నా, కేంద్రంలో ఒబిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అక్కడ అనేక ధర్నాలు చేశామని గుర్తు చేశారు. బిజెపి పార్టీ బిసి ముఖ్యమంత్రి ఎజెండా తీసుకున్నా, ఫ్లోర్ లీడర్‌ని కూడా బిసిని చేయలేకపోయారని విమర్శించారు. ఉన్న బిసి అధ్యక్షుడిని బిజెపి తీసేసిందని అన్నారు. తామెంతో మాకంత అనే విధంగా సామాజికంగా కుల గణనకు ప్రభుత్వం తీర్మానం పెడుతుందని, బాధ్యత గల ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సలహాలు చెప్పాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News