Tuesday, November 5, 2024

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఓడీలు రద్దు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖలో ఆన్ డ్యూటీ(ఓడీ)లను రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖలో ఉన్న ఎంవీఐ, ఏఎంవీఐ, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల ఓడీలు రద్దు అయ్యాయి. అటు, తెలంగాణ రవాణా శాఖలో ముగ్గురు జెటీసిలీను బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జెటిసిగా ఉన్న పాండురంగ నాయక్ అడ్మిన్ గా బదిలీ అవ్వగా, హైదరాబాద్ జెటిసి అడ్మిన్ గా ఉన్న మమతా ప్రసాద్ ను ఐటి అండ్ వీఐజీకి బదిలీ అయ్యారు. హైదరాబాద్ జెటిసి ఐటి అండ్ విఐజిగా ఉన్న రమేష్ ను హైదరాబాద్ జెటిసిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News