Friday, December 27, 2024

కులగణన షురూ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇం టింటి సర్వే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. జి ల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో ఇంటింటి సర్వేను ప్రారంభించారు. మంత్రి శ్రీధర్ బాబు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించారు. ప్రభుత్వ సిబ్బంది పట్టణాలు, గ్రామాల్లో ఇం టింటికి వెళ్ళి కుటుంబ వివరాలను సేకరిస్తున్నా రు. తొలి మూడు రోజులపాటు కుటుంబాలను గుర్తించనున్నారు. ఇంటింటికి వెళ్లి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో గుర్తించి వాటికి స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఈనెల 9న వివరాలు నమోదు చే స్తామని సమగ్ర కుటుంబ సర్వేలో ఏయే అంశా లు చెప్పాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా రు.

మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు క్షే త్రస్థాయిలో సర్వేను పర్యవేక్షిస్తూ సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తున్నారు. 85వేలమంది సి బ్బం ది సమగ్ర ఇంటింటికి సర్వేలో పాల్గొంటున్నా రు. కుటుంబాల గుర్తింపు పూర్తైన తర్వాత ఈనె ల 9 నుంచి 75 రకాల ప్రశ్నలతో వివరాలు సేకరిస్తారు. కుటుంబాల సామాజిక, ఆర్థిక, రా జకీయ, విద్య, ఉపాధి, కుల వివరాలను నమో దు చేస్తారు. ప్రధాన ప్రశ్నలు 56, ఉపప్రశ్నలు 19 కలిపి మొత్తం 75 ప్రశ్నలతో కుటుంబానికి సం బంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తారు. కుటుంబ సభ్యుల పేర్లతో పాటు అందరి మొబైల్ నంబర్‌లు సేకరిస్తారు. కులంతో పాటు ఆ కులాన్ని ఇతర పేర్లతో పిలిస్తే వాటిని కూడా రాసుకుంటారు.

ఏయే వివరాలను సేకరిస్తారు..?
కుటుంబ సభ్యుల వారీగా విద్య, చదివిన మాధ్యమం, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షికాదాయం తెలుసుకుంటారు. కుటుంబానికి ఉన్న భూములు, ఇళ్లు, ఇతర స్థిర, చరాస్తుల వివరాలు సేకరిస్తారు. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగాల్లో పొందిన రిజర్వేషన్ ప్రయోజనాలు గత ఐదేళ్లుగా పొందిన ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది, తీసుకున్న రుణాలు, వాటిని దేని కోసం ఉపయోగించారన్న అంశాలు సైతం అడుగుతారు. విదేశాలు లేదా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారా అనే అంశాలపై కూడా అధ్యయనం జరగనుంది. కుటుంబంలో ఎవరైనా విదేశాలకు, లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఏ కారణంతో వెళ్ళారనేది కూడా చెప్పాలి. ఉన్నత చదువులు, లేదా ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఇతర అవసరాలకు వెళ్లారా..? అనే వివరాలు అడుగుతున్నారు. విదేశాల్లో యుకె, అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియా, కెనడాలతో పాటు ఐరోపా దేశాలకు వెళ్లినుట్ల చెబితే ఒక్కో దేశానికి ఒక్కో ప్రత్యేక కోడ్ నమోదు చేస్తున్నారు.

రాష్ట్రం నుంచి ఎందరు వలస వెళ్లారు, ఏ కారణంతో వెళ్ళారనే సమగ్ర సమాచారం సేకరించడానికి ఈ ప్రశ్నలు రూపొందించినట్లు తెలుస్తోంది. సొంత ఇళ్లా? అద్దెకు ఉంటున్నారా? ఇంట్లో ఫ్రిజ్, కారు, ద్విచక్రవాహనం, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వంటివి ఉన్నాయా అనే వివరాలు అడిగి ఫారంలో నింపుతారు. దీనికి సంబంధించి ఆధార్, రేషన్‌కార్డు, భూసంబంధ వివరాలను ప్రజలు దగ్గర ఉంచుకోవాలని వారు సూచిస్తున్నారు.ప్రజల నుంచి సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచాలని ఎన్యుమరేటర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది. వివరాలన్నీ ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు ప్రణాళిక శాఖకు పంపిస్తారు. ఈ నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో బిసి, ఎస్‌సి, ఎస్‌టి, ఇతర వెనకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు, రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేసేందుకు ఈ డేటాను వినియోగించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్‌లు ఎంత ఉండాలో ఈ డేటా ఆధారంగానే ఖరారు చేయనున్నారు.

సర్వేకు సహకరించాలి : శ్రీధర్ బాబు
సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలందరూ సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. విద్య, ఉపాధి, సమాజిక, రాజకీయ, ఆర్థిక, ప్రణాళికల కోసం సర్వే చేపట్టినట్లు తెలిపారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు పోతాయని దుష్ప్రచారం చేస్తున్నారని దీని వల్ల ఎలాంటి కార్డులు పోవని మంత్రి స్పష్టం చేశారు.
ఎలాంటి పత్రాలు స్వీక్రరించరు : పొన్నం
ఇంటింటి సర్వే కోసం ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. అందరి సలహా మేరకు ప్రశ్నలు రూపొందించినట్లు వెల్లడించారు. ఇంటింటి సర్వేతో రాష్ట్రం రోల్ మోడల్‌గా మారబోతుందని ధీమా వ్యక్తం చేశారు. సర్వే సమయంలో అధికారులు ఎలాంటి పత్రాలు తీసుకోరని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News