Tuesday, September 24, 2024

దళిత వాడల్లో వెలుగు రేఖలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ ప్రభు త్వం ఏ పథకం ప్రవేశ పెట్టినా అది దేశంలోనే సంచలనాలు సృష్టిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఇదే రోజు ‘దళితజాతి స్వావలంబన కోసంప్రతిష్టాత్మకంగా దళితబంధు అనే సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టిం ది ఈ పథకం కింద చరిత్రలో ఎన్నడూ లేనివిధం గా రూ.10 లక్షలు నూటికి నూరుశాతం గ్రాంట్ గా ప్రభుత్వం అందిస్తోంది. 2021 ఆగస్టు 16న హుజూరాబాద్ మండలం శాలపల్లి- ఇందిరానగర్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పథకాన్ని స్వ యంగా ప్రారంభించారు.హుజూరాబాద్‌ను పైలె ట్ ప్రాజెక్టుగా తీసుకోవడం వల్ల ఇక్కడి దళితుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితుల బతుకుల్లో దళిత బంధు పథకం వెలుగులు నింపుతోంది. స ర్కారు అందించిన ఆర్థిక సాయంతో కూలీలు కాస్త ఓనర్లుగా మారి దర్జాగా జీవనం సాగిస్తున్నా రు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధం గా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చే స్తున్నది.

దేశంలోనే తొలిసారిగా దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం ఎంతో పారదర్శకంగా అమలు జరుగుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ పథకం వల్ల దళితులు వ్యాపారాలు చేసుకుంటూ, వాహనాలు నడుపుకుంటూ, పారిశ్రామికులుగా రాణిస్తున్నారు. ఒకప్పుడు ఇంకొకరిపై ఆధారపడి బతికిన దళితులు ఇప్పుడు ఇంకొకరికి ఉపాధి చూపే స్థాయికి చేరుకున్నారు. ఇప్పటికే తొలి విడతలోరాష్ట్రంలో దాదాపు 35 వేల మందికి దళితబంధు లబ్ధ్ది చేకూరింది. ఇదే స్ఫూర్తి తో రెండో విడతగా ప్రతి నియోజక వర్గానికి 1,100 మంది చొప్పున లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకోసం ప్రభుత్వం 2023-24 ఆర్థ్ధిక సంవత్సరం బడ్జెట్ లో రూ. 17, 700 కోట్లు కేటాయించింది. దళిత బంధు పథకం పూర్తి పారదర్శకంగా అమలు జరుగుతోందని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభు త్వం ‘దళిత బంధు’ యాప్ రూపొందించింది. ప్రతి లబ్ధిదారుల వివరాలను ఇందులో పొందుపరుస్తున్నారు. వీటిని సంబంధిత క్లస్టర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

యూనిట్‌ను స్థాపించిన లొకేషన్‌కు వెళ్లి సదరు యూనిట్ స్థితి గతులను, లబ్ధిదారుడి ఫొటో తీసి ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దినసరిగా సంపాదిస్తున్న వ్యాపార వివరాలన్నింటినీ నమోదు చేస్తున్నారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. పథకం అమలు తీరును పరిశీలించిన నీతి అయోగ్‌లాంటి సంస్థలు కూడా ప్రశంసించాయి.2022 సెప్టెంబర్ 2న జిల్లా పర్యటనకు వచ్చిన విశ్వనాథ్ బిష్ణోయ్ నేతృత్వంలోని నీతి అయోగ్ బృందం హుజూరాబాద్‌లోని పలు దళిత బంధు యూనిట్లను సందర్శించింది. లబ్ధిదారులు యూనిట్లను వినియోగించుకుంటున్న తీరు, ఉపాధి పొందుతున్న తీరును చూసి ఇంత మంచి పథకం దేశంలో ఎక్కడా లేదని బృంద సభ్యులు ప్రశంసించారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయగా, లబ్ధిదారులు తమకు నచ్చిన యూనిట్లు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు.

ఆర్థికంగా నిలదొక్కుకున్న దళిత కుటుంబాలు ఎన్నో తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు. నాడు కూలీలుగా పనిచేసిన తాము నేడు ట్రాక్టర్, కారు, ఇతర వాహనాలకు యజమానులమయ్యామని సగర్వాంగా చెప్పుకుంటున్నారు.. రానున్న కాలంలో తెలంగాణలో ప్రతీ దళిత కుటుంబం ఉన్నత స్థాయికి చేరుకుంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆశా భావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News