Wednesday, January 22, 2025

పేదరిక నిర్మూలనలో తెలంగాణ ప్రభుత్వం బేష్…

- Advertisement -
- Advertisement -
సంక్షేమం కోసం విన్నూత పథకాలు అమలుపై ప్రభుత్వానికి ప్రశంసలు
గ్రీన్ విలేజీలు మార్చేందుకు అధికారులు దృష్టి పెట్టాలి
కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి అమలు చేయడంలో ముందుందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశంసించారు. ఇదే తరహాలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమంలో బాగా పనిచేస్తుందని అభినందించారు. ఆదివారం రాజేంద్రనగర్ జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్డీ) కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలను గ్రీన్ విలేజీలుగా మార్చడంపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామీణాభివృద్ధిలో హర్టికల్చర్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. గ్రామాల్లో కాలుష్య కారకాలను వాడకుండా చూడాలని తెలిపారు. మొదట ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన వాటిల్లో ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలనలో జీవనోపాధులపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయేతర అంశాలపై మహిళలను దృష్టి సారించే విధంగా చేసి వారి ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు . దీని కోసం గ్రామీణాభివృద్ధి శాఖ, స్త్రీనిధి, సెర్చ్ ను భాగస్వామ్యం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, పంచాయతీరాజ్ డైరెక్టర్ హనుమంతరావు, గ్రామీణాభివృద్ధి స్పెషల్ కమిషనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News