Thursday, March 20, 2025

తెలంగాణ అప్పులు రూ.5,04,814 కోట్లు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది రాష్ట్రానికి వచ్చే ఆదాయం గురించి అంచనా లెక్కలు వేశారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (మార్చి- 2026) అప్పుల అంచనా రూ.5,04,814 కోట్లని తెలిపారు. రాష్ట్ర సొంత పన్నుల రాబడి రూ.1,45,419 కోట్లుగా అంచనా వేశారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన రుణాలు రూ.69,639 కోట్లని, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.29,899 కోట్లు వస్తాయని వివరించారు. పన్నేతర ఆదాయం రూ.31,618 కోట్లని, కేంద్రం నుంచి గ్రాంట్లలో రూపంలో రూ.22,782 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి అప్పుల రూ.5,04,814 కోట్లని తెలిపారు. జీఎస్డీపీలో అప్పుల శాతం 28.1, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల నుంచి వచ్చే ఆదాయం రూ.19,087 కోట్లని, ఎక్సైజ్ శాఖ నుంచి ఆదాయం రూ.27,623 కోట్లని, అమ్మకం పన్ను ఆదాయం రూ.37,463 కోట్లని, వాహనాలపై వేసే పన్నుతో రూ.8,535 కోట్ల ఆదాయం సమకూరుందని అంచనా వేశారు.

పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు : ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తోందని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పతి రూ.16,12,579 అని తెలిపారు. గతేడాదితో పోలిస్తే 10.1 శాతం పెరిగిందని చెప్పారు. 2024-25 ఏడాది తలసరి ఆదాయం రూ.3,79,751 అని మంత్రి భట్టి వివరించారు. రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధిరేటు 9.6 శాతం అని పేర్కొన్నారు. దేశ తలసరి ఆదాయం రూ.2,05,579 కోట్లు కాగా దేశ తలసరి ఆదాయ వృద్ధిరేటు 8.8 శాతం అని తెలిపారు. దేశ తలసరి ఆదాయాన్ని పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం 1.8 రెట్లు ఎక్కువగా ఉందని వివరించారు.

తెలంగాణకు సమకూరే ఆదాయం అంచనా
రాష్ట్ర సొంత పన్నుల రాబడి రూ.1,45,419 కోట్లు
బడ్జెట్‌లో ప్రతిపాదించిన రుణాలు రూ.69,639 కోట్లు
కేంద్ర పన్నుల్లో వాటా రూ.29,899 కోట్లు
పన్నేతర ఆదాయం రూ.31,618 కోట్లు
కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.22,782 కోట్లు
జీఎస్డీపీలో అప్పుల శాతం 28.1శాతం
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.19,087 కోట్లు
ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.27,623 కోట్లు
అమ్మకం పన్ను ఆదాయం రూ.37,463 కోట్లు
వాహనాలపై పన్ను ఆదాయం రూ.8,535 కోట్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News