Thursday, December 12, 2024

వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

- Advertisement -
- Advertisement -

వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, వరంగల్ జిల్లా ఇన్‌చార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. వరంగల్ నగర అభివృద్ధిపై మంత్రి పొంగులేటి బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా మంత్రులు కొండా సురేఖ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా వరంగల్ నగర అభివృద్ధి, ఐఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్, భద్రకాళి చెరువు, విమానాశ్రయం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో ఇచ్చిన

హామీల ఆమలుకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని వరంగల్ నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్‌లను త్వరితగతిన తయారుచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. వరంగల్ నగరంలో నిర్మించే రింగ్ రోడ్డుతో జాతీయ రహదారులకు కనెక్టివిటీ ఉండేలా చూడాలని, ఈ ప్రాజెక్టుకు భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మంత్రి పొంగులేటి సూచించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణను యుద్ధప్రాతిపదికన, భద్రకాళి చెరువు శుద్ధీకరణ పనులను వేగవంతంగా చేపట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News