నలుగురు సీనియర్ అధికారులతో కమిటీ
నదికి 50 మీటర్ల వరకు
బఫర్‌జోన్‌లో ఎలాంటి
నిర్మాణాలకు అనుమతి లేదు
50 నుంచి 100 మీటర్ల
వరకు కొత్తగా అనుమతులు
ఇవ్వరాదు మాస్టర్ ప్లాన్
ఖరారు అయ్యే
వరకు ఈ నిబంధనలు
వర్తింపు.. ఉత్తర్వులు జారీ
మనతెలంగాణ/హైదరాబాద్: మూసీ పరిసరాల్లో నిర్మాణాల నియంత్రణ కు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మూసీ పరిసరాల్లో ప్రణాళిక రహిత నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం నలుగురు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ జిఓ 180ను జారీ చేశారు. ఈ కమిటీలో మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జేఎండి, డిటిసిపి డైరెక్టర్, జీహెచ్‌ఎంసి చీఫ్ ప్లానర్, హెచ్‌ఎండిఏ ప్లా నింగ్ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు. మూసీకి 50 మీటర్ల వరకు బఫర్‌జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 50 నుంచి 100 మీటర్ల వరకు కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. మాస్టర్‌ప్లాన్ ఖరారయ్యే వరకు, కమి టీ క్లియర్ చేసేంతవరకు ఏ విధమైన కొత్త అనుమతులు ఇవ్వకూడదని ప్ర భుత్వం ఆదేశించింది. మూసీకి 100 మీటర్ల వరకు ప్రభుత్వ పనులు చేపట్టాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.