- Advertisement -
భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, పొంగులేటితో
ఏర్పాటు హెచ్‌సియు, విద్యార్థులు,
ప్రజాసంఘాలతో చర్చలు జరపనున్న
కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై మంత్రుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు సిఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా ప్రకటించారు. హెచ్‌సియూ యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జేఏసి సివిల్ సొసైటీ గ్రూప్, విద్యార్థులు, ప్రజా సంఘాలతో ఈ మంత్రుల కమిటీ సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరిస్తుందని సిఎం రేవంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
- Advertisement -