- Advertisement -
తెలుగు రాష్ట్రాల్లో జలవిలయం ప్రకంపనలు సృష్టిస్తోంది. వరద నీటి ఉధృతితో కాలనీల్లోని పలు ఇళ్లు నీట మునిగాయి. ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు.తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. రోడ్లు, రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోవడంతో రైళ్లు రద్దు చేయడంతోపాటు ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేశారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా సోమవారం విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు సెలవు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఉస్మానియా, జేఎన్టీయూ, కేయూ యూనివర్సిటీల పరిధిలోని అన్ని కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఈరోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. ఏపీలోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
- Advertisement -