Tuesday, January 7, 2025

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం.. ఒక్కొక్కరికి రూ.లక్ష సాయం

- Advertisement -
- Advertisement -

సివిల్స్‌ మెయిన్స్‌ కు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ఆదివారం ప్రజాభవన్‌లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సివిల్స్ ఇంటర్వ్యూకి ఎంపికైన 20 అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున సీఎం రేవంత్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. “మన విద్యార్థులు సివిల్స్ ఇంటర్వ్యూలో పాసైతే అంతకుమించిన ఆనందం ఏముంటుంది. మన అభ్యర్థులు ఎంపిక కావాలని మేమంతా కోరుకుంటున్నాం. ఆర్ధిక సమస్యలపై కాకుండా, చదువు మీద దృష్టి పెట్టాలనే ప్రభుత్వ సాయం. 20 మంది ఇంటర్వ్యూకి వెళ్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News