Monday, December 23, 2024

అంగన్‌వాడీలకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవీ విరమణ ప్రయోజనాలను అందజేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ‘అమ్మ మాట – అంగన్ వాడీ బాట’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్ రహ్మత్ నగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ కు రూ .2 లక్షలు, హెల్పర్‌కు రూ. లక్ష రిటై ర్మెంట్ బెనిఫిట్స్ అందజేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో జీఓ విడుదల చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా మొదటి దశలో ప్రభుత్వ పాఠశాల భవనాల్లోని సుమారు 15 వేల అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. వాటిని ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మారుస్తున్నా రు. వాటిని ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే తీసు కొచ్చారు. కాగా జిఓ 10 రద్దు చేసి తమ సమస్య లు పరిష్కరించాలని అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగ భద్రత కల్పించాలని, పదవీ విరమణ ప్రయోజనాలను ప్రకటిం చాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News