- Advertisement -
హైదారాబాద్: ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. క్రమబద్ధీకరణకు ప్రతిపాదనలు ఇవ్వాలని అన్ని శాఖలను ఆర్థికశాఖ మంగళవారం కోరంది. మంజూరైన పోస్టుల్లో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు అనుగుణంగా క్రమబద్ధీకరణ చేయనుంది. 2016లో జారీ చేసిన జీవో ప్రకారం అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు వీలైనంత త్వరగా పంపించాలని ఆర్థిక శాఖ కోరింది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై అసెంబ్లీలో సిఎం కెసిఆర్ ప్రకటించారు. 11 వేలపైచిలుకు ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సిఎం పేర్కొన్నారు.
- Advertisement -