Friday, November 15, 2024

డిఎస్‌సి 2008 అభ్యర్థులకు కాంట్రాక్టు కొలువులు

- Advertisement -
- Advertisement -

డిఎస్‌సి -2008 అభ్యర్థులకు సర్కార్ గుడ్ న్యూస్
నష్ట పోయిన బి.ఇడి అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం
ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డిఇఒ కార్యాలయాల్లో దరఖాస్తులకు అవకాశం
27 నుంచి వచ్చే నెల 5 వరకు సర్టిఫికెట్ పరిశీలన
మనతెలంగాణ/హైదరాబాద్: 2008 డిఎస్‌సి అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2008 డిఎస్‌సిలో నష్ట పోయిన బి.ఇడి అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2008 డిఎస్‌సిలో అర్హత సాధించి ఉద్యోగం పొందని బి.ఇడి అభ్యర్థులకే ఈ అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యా సంచాలకులు ఇవిఎన్ నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు సర్టిఫికెట్ పరిశీలన ఉంటుందని తెలిపారు.

అర్హులైన అభ్యర్థులు www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి వెరిఫికేషన్ ఫాం డౌన్‌లోడ్ చేసుకుని ఆయా జిల్లాల్లో డిఇఒ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొనారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1200 మంది అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుంది. కాగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో దాదాపు 16 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News