Monday, March 10, 2025

యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.11వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

55 నియోజకవర్గాల్లో
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్
పాఠశాలల నిర్మాణానికి నిధులు
మంజూరు ఉప ముఖ్యమంత్రి
భట్టి విక్రమార్క ప్రకటన

రెసిడెన్షియల్ విద్యార్థులు ప్రపంచాన్ని
శాసించే సంస్థల్లో పని చేసేలా
ఎదుగుతారు ప్రజల జీవన
స్థితిగతులు మెరుగుపరచడానికి ప్రతి
పైసా వినియోగిస్తున్నాం మీడియా
సమావేశంలో వెల్లడించిన
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్
రెసిడెన్షియల్ స్కూళ్లు: మంత్రి
పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లా
సమగ్రాభివృద్ధికి ప్రత్యేక
ప్రణాళిక: మంత్రి కోమటిరెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ.11 వేల కోట్లను విద్యాశాఖ మంజూరు చేసింది. 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో స్కూల్‌కు రూ.200 కోట్లు చొప్పు పరిపాలన అనుమతులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైనదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లోని మంత్రి కోమటిరెడ్డి నివాసంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన, సామన్య, మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మాణం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల మాదిరిగా దేశంలో ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఉండవన్నారు.

గత కొద్ది నెలల క్రితం ప్రజా ప్రభుత్వం మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేసి రూ. 600 కోట్లు నిధులు కేటాయించిందన్నారు. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం 55 పాఠశాలలకు నిధులు కేటాయిస్తూ విద్యాశాఖ అధికారులతో విడుదల చేయించిన ఉత్తర్వులను చూపించారు. సుమారు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో అద్భుతమైన క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, అందులో విద్యా బోధన చేసే ఉపాధ్యాయులకు కూడా అక్కడే వసతి కల్పించడానికి గృహ సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. విద్యార్థులకు అన్ని వసతులతో పాటు సాంకేతికంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజిటల్ విద్యా బోధన చేయడానికి డిజైన్ చేశామన్నారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన ల్యాబ్స్, లైబ్రరీ తో పాటు మినీయాప్ థియేటర్ కూడా ఉండేలా డిజైన్ చేసిన ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు పేద, బడుగు, బలహీనవర్గాల

కుటుంబాలకు, ప్రయివేటు విద్యాసంస్థల్లో లక్షలకు లక్షల రూపాయల ఫీజులు చెల్లించలేని వారికి ఉపయోగపడుతాయన్నారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా సిలబస్‌ను కూడా రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఇంటిగ్రెటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ నాటి ప్రభుత్వం కోళ్లు, పశువుల రేకుల షెడ్‌లలో పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. గత ప్రభుత్వ రూ.7.19 లక్షల కోట్లను అప్పు చేసిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఒకటే పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలి, ఆ దిశగా పని చేస్తున్నామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News